Game Changer:ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ పెంచేశారు మేకర్స్? కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. ఒకరకంగా చెప్పాలి అంటే పర్వాలేదు అనిపించుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పుడు అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో ఎంతో మంది హీరోలు నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన హీరో రామ్ చరణ్ (Ram Charan) అయినప్పటికీ గతంలో కొన్ని సినిమాలలో హీరోలుగా నటించిన వారు ఈ సినిమాలో వివిధ పాత్రలలో కనిపించడం గమనార్హం.. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు నటించిన ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
గేమ్ ఛేంజర్ సినిమాలో ఎంతమంది హీరోలంటే?
గేమ్ ఛేంజర్ సినిమాలో.. గతంలో స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా చేసి, ఆ తర్వాత హీరోగా మారి ‘మర్యాద రామన్న’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న సునీల్(Suneel) రామ్ చరణ్ దగ్గర బంట్రోతు అనే పాత్రలో కనిపించారు. ఆ తర్వాత రామ్ చరణ్ తమ్ముడి పాత్రలో.. గతంలో ‘కేరింత’ సినిమాలో హీరోగా నటించిన విశ్వంత్ (Vishwanth) నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్.జె. సూర్య(SJ.Surya ) గతంలో ‘న్యూ’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక సూర్య అనుచరుడి పాత్రలో మరో హీరో అయిన నవీన్ చంద్ర (Naveen Chandra) నటించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన శ్రీకాంత్ (Srikanth) ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో ఎస్. జె.సూర్య తండ్రిగా కనిపించారు. నటుడిగా మారిన ప్రముఖ దర్శకుడు సముద్రఖని (Samudrakhani) కూడా గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించారు.. ఈయన ఈ సినిమాలో శ్రీకాంత్ అనుచరుడి పాత్రలో నటించారు.
మొత్తం 18 మంది హీరోలు..
సీనియర్ హీరో నరేష్ (V.K.Naresh) గతంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు కామెడీ బేస్డ్ చిత్రాలు కూడా చేసారు. ఈయన ఇప్పుడు రామ్ చరణ్ పెంపుడు తండ్రి పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. మలయాళ హీరో జయరాం (Jayaram)కూడా ఈ సినిమాలో ఎస్ జె సూర్య సోదరుడు పాత్రలో కనిపించారు. అంతేకాదు ‘బలగం’ సినిమాతో ఒక్క నైట్ లోనే హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న ప్రియదర్శి (Priyadarshi) కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా కొన్ని సన్నివేశాలలో కనిపించారు. ‘సుందరం మాస్టర్’ సినిమాతో హీరోగా మారిన వైవా హర్ష (Viva Harsha) ‘వివాహ భోజనంబు’ సినిమాతో హీరోగా అవతరించిన కమెడియన్ సత్య (Satya), ‘అనగనగా ఓ అతిథి’ హీరో చైతన్య కృష్ణ(Chaitanya Krishna) ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితులుగా కనిపించారు. ఇక ‘వినాయకుడు’ హీరో కృష్ణుడు(Krishnudu), ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ హీరో అజయ్ ఘోష్ (Ajay Ghosh) ఇద్దరూ కూడా క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మ్యాన్ లుగా ఇందులో నటించారు. ఇక వీరితో పాటు హీరోగా పలు సినిమాలు చేసిన కమెడియన్ లు అయినా వెన్నెల కిషోర్ (Vennela Kishore), బ్రహ్మానందం(Brahmanandam), పృథ్వీ (Prithvi) వంటి వారు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ సినిమాకి ఒకరే హీరో అయినా.. ఇందులో నటించిన వారందరినీ లెక్క వేసుకుంటే.. దాదాపుగా ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిపి మొత్తం 18 మంది హీరోలు నటించారని చెప్పవచ్చు.