Pune Murder : మహారాష్ట్రలోని (maharashtra) పుణెలో (Pune) ఎరవాడ ప్రాంతంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై ఓ యువతిని యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చుట్టూ జనం చూస్తుండగానే ఈ హత్య జరగడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మాారాయి. ఈ ఘటనలో శుభదా శంకర్ కోడరే అనే 28 ఏళ్ల యువతి మరణించింది. హత్య చేసిన వ్యక్తిని ఆమె సహోద్యోగి కృష్ణ సత్యనారాయణ కనోజాగా గుర్తించారు. కాగా.. సంఘటన సాయంత్రం 6:15 గంటలకు జరిగిందని స్థానికులు తెలిపారు.
పూణేలోని ఓ ఐటీ సంస్థ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో ఈ హత్య జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కృష్ణ సత్య నారాయణ వంట గదిలో వాడే పదునైన కత్తితో దాడి చేసిన తర్వా శుభదా నేలపై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో నిందితుడు.. కత్తితో అక్కడే తిరగడం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఎవరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాకుండా.. ప్రేక్షకులు చూసినట్లు చూస్తుండిపోయారు. కొంత సేపటి తర్వాత.. పెద్ద సంఖ్యలో పోగైన జనం.. నిందితుడిని పట్టుకుని, ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ.. చికిత్స పొందుతూ సాయంత్రం బాధితురాలు మృతి చెందింది.
వీరిద్దరూ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌లో అకౌంటెంట్లుగా పనిచేస్తున్న సహోద్యుగులుగా పోలీసులు గుర్తించారు. వీరి మధ్య ఆర్థిక వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. హత్యకు గురైన యువతి శుభదా శంకర్ కోడారే నిందితుడి నుంచి దాదాపు రూ.4.5 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదంటూ ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకుందని తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఈ అప్పు తీర్చమని నిందితుడు అడుగుతున్నా.. పట్టించుకోకపోవడం వారిద్దరి మధ్య వివాదం నడుస్తుందని అంటున్నారు. ఆమె తండ్రి ఆరోగ్య విషయంలో అబద్ధం చెప్పి డబ్బులు లాగేసిందని ఆరోపిస్తున్న నిందితుడు.. ఆమె స్వగ్రామానికి వెళ్లి నిర్ధరించుకున్నట్లు చెబుతున్నాడు. దాంతో.. అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడాన్ని సహించలేక.. ఈ దాడికి పాల్పడ్డట్టు చెబుతున్నారు.
వారిద్దరు పనిచేసే సంస్థ పార్కింగ్ స్థలంలో దాడి జరిగిన తర్వాత బాధితురాలు.. తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం వివరిస్తున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ సమయంలో ఫోన్ లాక్కున్న కృష్ణ సత్యనారాయణ కనోజా ఆమె తండ్రితో మాట్లాడి, తనకు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. కత్తితో దాడి చేసిన తర్వాత.. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చాలా సేపటి వరకు అలాగే ఉండిపోవడంతో.. తీవ్ర రక్తస్రావం గురైంది.
Also Read : రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. డౌట్ వచ్చిన చూడగా అంతా షాక్..
దాడి జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కృష్ణ సత్యనారాయణ కనోజాను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.