BigTV English

Honeymoon Murder Case: పెళ్లి చేసుకుంటా, కానీ.. తల్లికి వార్నింగ్ ఇచ్చిన సోనమ్? హనీమూన్ మర్డర్‌లో మరో ట్విస్ట్!

Honeymoon Murder Case: పెళ్లి చేసుకుంటా, కానీ.. తల్లికి వార్నింగ్ ఇచ్చిన సోనమ్? హనీమూన్ మర్డర్‌లో మరో ట్విస్ట్!

Honeymoon Murder Case: ఇండోర్ హనీమూన్ మర్డర్ కేసులో ఏం జరుగుతోంది? కొత్త విషయాలు తెరపైకి రావడం వెనుక అసలేం జరిగింది? ఆఫీసులో ఓ ఉద్యోగితో ఎఫైర్ ఉన్న విషయం సోనమ్ ముందుగా తల్లికి చెప్పిందా? బలవంతంగా సోనమ్‌కి ఎలా పెళ్లి చేసింది? మ్యారేజ్ తర్వాత హనీమూన్ మర్డర్‌కు సోనమ్ ప్లాన్ చేసిందా? అవుననే అంటున్నారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు.


దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఇండోర్ దంపతుల హనీమూన్ కేసు. రాజా రఘువంశీతో తనకు పెళ్లి ఇష్టం లేదని తన తల్లికి సోనమ్ ముందుగానే చెప్పింది. ఈ విషయంలో బలవంతంగా వివాహం చేయిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తల్లిని హెచ్చరించింది. తనకు ఇష్టంలేకున్నా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది.

రాజ్ కుశ్వాహాను తాను ప్రేమిస్తున్నానని, అతడ్ని వివాహం చేసుకుంటానని చెప్పిందట. అయినా సోనమ్ తల్లి వినకుండా బలవంతంగా పెళ్లి చేసినట్టు సమాచారం. తన ప్రేమను అంగీకరించక ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని సోనమ్ ఆగ్రహంతో రగిలిపోయింది. అన్నట్లుగా చేసింది.  బలవంతంగా రాజా రఘువంశీతో తాళి కట్టించుకుంది సోనమ్.


వివాహం తర్వాతైనా ఏ మాత్రం మారలేదు. అను నిత్యం ఇష్టంలేని పెళ్లి చేసిందని తల్లిపై పగతో రగలిపోయింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత రాజా రఘువంశీ హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. పైవివరాలను రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ALSO READ: కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

తన సోదరుడ్ని ఈ విధంగా సోనమ్ హత్య చేయిస్తుందని ఎవరూ ఊహించ లేదని వాపోయాడు. ఇండోర్‌కు చెందిన 24 ఏళ్ల సోనమ్- రాజారఘువంశీకి మే 11న వివాహం జరిగింది. రాజ్‌తో సంబంధం ఉన్నప్పటికీ సోనమ్‌ పెళ్లి జరిగింది. రాజ్..  తన కుటుంబానికి చెందిన ఫర్నిచర్ షీట్ యూనిట్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. సోనమ్ కుటుంబ వ్యాపారాన్ని చూసేది. మే 23న రాజా- సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయకు బయలుదేరారు.

ఇష్టంలేని పెళ్లి కారణంగా భర్త రాజా రఘువంశీతో ఫస్ట్ నైట్ వాయిదా వేసింది. దీనికి అనేక కారణాలు చెప్పిందట.  తొలుత అస్సాంలో కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని చెప్పిందట. అలా చేస్తే మన ఫ్యామిలీకి మంచి జరుగుతుందని భర్తను నమ్మించింది.  ఆ సమయంలో హనీమూన్ ట్రిప్‌కు ప్లాన్ చేసింది.  ఇండోర్ నుంచి అస్సాంకు బయలుదేరింది ఈ జంట.  23న ఈ జంట మిస్సయ్యింది.

జూన్ 2న రాజా మృతదేహం దొరికిన చోటు నుండి 20 కిలోమీటర్ల దూరంలో నోంగ్రియాట్ గ్రామంలో హోమ్‌స్టే చేశారు.  హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులు చంపాలని స్కెచ్ వేసింది సోనమ్. ఆ ప్లాన్ అక్కడ విఫలమైతే తాను రంగంలోకి దిగాలని భావించింది. కొండపై నుంచి లోయలోకి భర్తను తోసి వేయాలని నిర్ణయించింది.  పోస్టుమార్టం నివేదిక ప్రకారం రాజా తలపై పదునైన ఆయుధంతో రెండుసార్లు దాడి చేశారు. ఆయుధాలతో దాడి చేసినట్టు గాయాలున్నాయని ఎస్పీ వివేక్ సియెమ్ తెలిపారు.

Related News

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Big Stories

×