10 Fastest Trains: గత దశాబ్ద కాలంగా భారతీయ రైల్వే మరింత అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ స్లీపర్ రైలు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే, భారత్ తో పోల్చితే ఫాస్టెస్ట్ రైళ్ల విషయంలో పలు దేశాలు మరింత ముందంజలో ఉన్నాయి. ఇంతకీ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఏవి? అవి ఏ దేశాల్లో ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో టాప్ 10 వేగవంతమైన రైళ్లు
అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ల విషయంలో చైనా, జపాన్, దక్షిణ కొరియాతో సహా పలు దేశాలు చాలా పురోగతి సాధించాయి. అక్కడ బుల్లెట్ రైళ్లు గంటకు సుమారు 400 కిలో మీటర్ల కంటే వేగంగా ప్రయాణిస్తున్నాయి.
⦿ చైనా ఇప్పటికే CRH380A హెక్సీ అనే బుల్లెట్ రైలును నడుపుతోంది. ఈ రైలు గంటకు 486 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ షాంఘై మాగ్లెవ్ అనే బుల్లెట్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది కూడా చైనాలోని ప్రధాన నగరమైన షాంఘైలో నడుస్తుంది. ఈ రైలు గంటకు 460 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
⦿ చైనాకు చెందిన CR450 అనే బుల్లెట్ రైలు ప్రపంచంలో మూడో ఫాస్టెస్ట్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
⦿ అభివృద్ధిలో ముందజంలో ఉన్న దక్షిణ కొరియాలో HEMU-430X అనే రైలును నడిపిస్తుంది. గంటకు 430 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే నాలుగో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: తెలంగాణలో మరో రెండు ఎయిర్ పోర్టులు, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
⦿ CR400 ఫక్సింగ్ అనే బుల్లెట్ రైలు చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రైలు గంటకు 350 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.
⦿ సీమెన్స్ వెలారో E/AVs 103 అనే బుల్లెట్ రైలు యూరోపియన్ కంట్రీ అయిన స్పెయిన్ లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 403.7 కిలోమీటర్లు.
⦿ ఫ్రెసియారోస్సా అనే బుల్లెట్ రైలు ఇటలీలో నడుస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు.
⦿ అటు ప్రసిద్ధ యురోపియన్ కంట్రీ జర్మనీలో DB ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ 3 అనే రైలు నడుస్తుంది. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
⦿ షింకన్ సెన్ H5 అనే బుల్లెట్ రైలు జపాన్‌లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు.
⦿ TGV అనే రైలు ఫ్రాన్స్‌లో నడుస్తుంది. ఈ రైలు గంటకు గరిష్టంగా 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
Read Also: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలా? ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోండి!