BigTV English
Advertisement

Karthi: సీక్వెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్.. కొత్తగా మరొకటి ?

Karthi: సీక్వెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్.. కొత్తగా మరొకటి ?

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య ఆయన కొద్దిగా తెలుగు వారికి దూరమయ్యాడేమో.. కానీ, కార్తీ మాత్రం ఎప్పుడు తెలుగు వారికి దగ్గరగానే ఉంటాడు. ఈ మధ్యకాలంలో కార్తీ ఎంచుకునే కథలు అన్ని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. విజయప్రజయాలను పక్కన పెట్టేసి మంచి కథలను మాత్రమే ప్రేక్షకులకు అందించడానికి ఈ హీరో ఎంతగానో కష్టపడుతున్నాడు.


గతేడాది సత్యం సుందరం లాంటి మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక కోలీవుడ్లో ఈ కుర్ర హీరోకి ఉన్న మరో పేరు సీక్వెల్స్ రాజా. ఆయన నటించిన హిట్ సినిమాలు అన్నింటికీ  సీక్వెల్స్ ప్రకటిస్తూ వస్తున్నాడు. మొదటినుంచి కూడా కార్తీ నటించిన ఏ సినిమాకి అయినా రెండు పార్ట్స్ ఉంటాయని మేకర్స్ చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ హీరో రెండు సీక్వెల్స్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. అందులో మొదటిది ఖైదీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ 2 త్వరలోనే రానుంది.

ఇక ఈ సినిమా కాకుండా కార్తీ నటించిన సర్దార్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా సర్దార్ 2 కూడా ఈ మధ్యనే సెక్స్ పైకి వెళ్ళింది. స్పై గా సర్దార్ లో కనిపించిన కార్తీ.. సర్దార్ 2 లో మరో ఆపరేషన్ తో వస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా ఈ హీరో సీక్వెల్ ఉండేవిధంగానే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట.  ఈ మధ్యనే కార్తీ తన 29వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం.


1960లో సముద్రంలో జరిగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరెక్కుతుంది.  ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మార్షల్ అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తుంది .మార్షల్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.  వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కడంతో మొత్తం కథను ఒకే భాగంలో చెప్పడం కష్టమని, దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని కూడా  తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంలో కార్తీ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్ కమెడియన్ వడివేలు కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. కార్తీ  కెరీర్  లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మార్షల్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కుర్ర హీరో సర్దార్ 2 ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. దీని తర్వాత ఖైదీ 2 పట్టాలెక్కుతుందని ఈ రెండిటితో పాటు మార్షల్ పార్ట్ 1  షూటింగ్ కూడా మొదలుకానుందని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే మార్షల్  టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాలతో కార్తీ ఎలాంటి విజయాలను అందుకుంటాడు చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×