Road Accident: తూర్పుగోదావరి జిల్లా యన్నగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో అక్కడి కక్కడే ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు అక్కడ కోలుకుంటున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వల్ల జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు, ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి డివైడర్‌ని దాటి ఎదురుగా వస్తున్న రెండు కార్లను బలంగా ఢీ కొట్టింది.
ఘటన గురించి సమాచారం అందుకున్నారు పోలీసులు. వెంటనే అక్కడికి చేరుకున్నాయి. కార్లలో చిక్కుకున్నవారిని బలవంతంగా బయటకు తీశారు పోలీసులు. ఆ తర్వాత వాహనాలను పక్కకు తొలగించారు. వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు. అప్పటికి ఇద్దరు మృతి చెందారు. గాయపడిన నలుగురు మరొక వాహనంలో గోపాలపురం పీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.
ఓ కారు.. మరో రెండు కార్ల ఢీ కొట్టింది.. స్పాట్‌లో ముగ్గురు మృతి
అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరొక కారులోని వ్యక్తులు కీలక విషయాలు బయటపెట్టారు. తాము ఏలూరు నుంచి రాజమండ్రిలోని శివాలయానికి వెళ్తున్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపాడు. తొలుత ప్రమాదానికి గురైన కారు డివైడర్‌ని పైనుంచి మరొక రహదారిలోకి ప్రవేశించాడని వివరించాడు. ఈ ఘటనలో మా కారుని డ్యామేజ్ అయ్యిందని, ఈలోగా మా వెనుక వస్తున్న కారుని బలంగా ఢీ కొట్టాడని తెలిపాడు.
కొవ్వూరు-దేవరపల్లి-నల్లజర్ల మండలాల్లో విస్తరించింది 53 కిలో మీటర్ల జాతీయ రహదారి. ఇప్పటివరకు ఈ రోడ్డుపై దాదాపు 84 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 46 మంది వరకు మరణించారు. ఈ ఏడాది 8 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 9 మంది వరకు చనిపోయినట్టు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి.
ALSO READ: చిట్టి చిట్టి సమోసాలు తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?
తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
డివైడర్ దాటి మరో కారును ఢీకొట్టిన కారు
రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Three people died in a tragic road accident on the… pic.twitter.com/a80vzu81TT
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2026