Food Raid: కుళ్లిన పదార్థాలతో చిట్టి సమోసాలు తయారు చేస్తున్న కేంద్రం పై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్, కుల్సుంపురా పోలీసులతో కలిసి దాడి చేశారు. నిర్వాహకున్ని అరెస్ట్ చేసి 5లక్షల విలువ చేసే సరుకును సీజ్ చేశారు. డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జియాగూడలోని ఎస్బీఏ గార్డెన్ ఎదురుగా నాసిరకం మైదా, కుళ్లిన ఉల్లిగడ్డ, కూరగాయలతో అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కుల్సుంపురా పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తో దాడి చేశారు.
Also Read: Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా అబ్దుల్ రషీద్ (73) అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నట్టు వెళ్లడయ్యింది. కుళ్లిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెతో సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో పోలీసులు 5వందల కుళ్లిపోయిన గుడ్లు, వాడిన 5కిలోల వంట నూనె, అమ్మకానికి సిద్ధం చేసిన 350 ఎగ్ సమోసాలు, 6వందల స్వీట్ కార్న్ సమోసాలు, వెయ్యి ఉల్లిగడ్డ సమోసాలు, 50 కిలోల మైదా, 4బస్తాల ఉప్పు, 2వేల సమోసా పట్టీలు, 10కిలోల పాడైపోయిన స్వీట్ కార్న్ సీజ్ చేశారు. దాంతోపాటు యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Weight loss drinks: డైలీ మార్నింగ్ ఈ డ్రింక్స్ తాగితే.. వద్దన్నా బరువు తగ్గుతారు తెలుసా ?