BigTV English

Minister Ponnam Comments: అసలు నిన్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ముందు చెప్పు: మంత్రి పొన్నం

Minister Ponnam Comments: అసలు నిన్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ముందు చెప్పు: మంత్రి పొన్నం

Ponnam Prabhakar Fires On Bandi Sanjay(Telangana news today): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ నేత బండి సంజయ్ పై మండిపడ్డారు.


అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం వహించాల్సిన ప్రధాని మోదీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచి పెడుతుందని మోదీ మాట్లాడడం సరికాదన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పని చేసిందన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని.. అందుకే తొలి దశ ఎన్నికల పోలింగ్ తర్వాత మోదీకి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఇప్పటికైనా మోదీ ఇలాంటి విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.

ఇటు బండి సంజయ్ పై కూడా మంత్రి ఫైరయ్యారు. బండి సంజయ్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఉపాధి హామీ నిధులను కూడా ఆయనే తెచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి కరీంనగర్ ఏం చేశారో చెప్పాలని, అసలు ఇంతకు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీజేపీ ఎందుకు తొలగించిందో ముందు చెప్పాలని బండి సంజయ్ ను మంత్రి ప్రశ్నించారు.


Also Read: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే.. సీఎం రేవంత్ రెడ్డి!

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. అందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుస్తామంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Big Stories

×