BRS Rivalry: స్వేచ్ఛ బ్యూరో: సోషల్ మీడియాలో ఇరువురు పోటాపోటీగా పెడుతున్న పోస్టులు చర్చకు దారితీశారు. నువ్వు ట్విట్ చేస్తే.. నేను ట్విట్ చేస్తా అన్నట్లు ఉన్నాయి. మరోవైపు పార్టీ కార్యక్రమాలను సైతం ఇద్దరు చెరోక జిల్లాకు వెళ్తున్నారు. కార్యకర్తలను యాక్టీవ్ చేసేందుకు పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారని పార్టీ పేర్కొంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇద్దరు ఎవరికి వారుగా బలోపేతం అయ్యేందుకు ఈ పర్యటనలు అని ప్రచారం జరుగుతుంది. బావబామ్మర్దులు ఇద్దరు అగ్రనాయకులే కావడంతో ఇప్పుడు పార్టీలోనూ ఇద్దరి కార్యక్రమాలు హాట్ టాపిక్ అయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు అగ్రనాయకులే. వారిద్దరు అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై గళం ఎత్తుతున్నారు. ఏదో కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని తపన పడుతున్నారు. అందుకు వారే అంశాలను ఎంచుకొని మరి వాటిపై మాట్లాడుతున్నారు. పార్టీ నుంచి ఫలానా కార్యక్రమం చేయండి.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజూ చేయాలనేది మాత్రం చెప్పడం లేదని వీరిద్దరి కార్యక్రమాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంతవరకు బాగున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ చేస్తున్న ట్విట్లు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకరు ఒక అంశంపై పెడితే ఆ వెంటనే మరొకరు పోస్టుపెడుతున్నారు. అదినూ క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్టు అవుతున్నాయి. అది ఇప్పుడు కేడర్ లో గందరగోళానికి తెరదీసింది.
బావబామ్మర్దులు ఉమ్మడి కార్యాచరణతో మాత్రం ప్రజల ముందుకు వెళ్లడం లేదని వారి కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. కలిసిపోతున్నామని ప్రజలకు సందేశం ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఒకరు కరీంనగర్ జిల్లాకు వెళ్తే..మరోకరు సంగారెడ్డిగానీ మెదక్ గానీ వెళ్తున్నారు. హరీష్ రావు కరీంనగర్ వెళ్తే.. కేటీఆర్ మేడ్చల్ జిల్లాకు వెళ్తున్నారు.. ఇలా ఇద్దరు వేర్వేరుగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అంటే ఎవరికి వారుగా తన కేడర్ ను బలోపేతం చేసుకుంటున్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీకి కేడర్ ఉన్నప్పటికీ అర్బన్ ప్రాంతాల్లో కేటీఆర్ కు ఆదరణ ఉండగా, హరీష్ రావు రూరల్ ప్రాంతాల్లోని ప్రజల్లో ఆదరణ ఉంది. అయితే అర్బన్ ప్రాంతాల్లోనూ హరీష్ రావు బలోపేతం కావాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా కేటీఆర్ సైతం రూరల్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారని, అందులో భాగంగానే త్వరలోనే విస్తృత పర్యటనలు చేపట్టబోతున్నారని సమాచారం. వేర్వేరు కార్యక్రమాలు చేపడుతుండటంతో ఇరువురికి ఆదరణ మాత్రం పెరుగుతుందని స్పష్టమవుతోంది.
Also Read: Comedy drama OTT: నలుగురు అమ్మాయిలతో కేకలు పెట్టిస్తూ… నాలుగు సీజన్లతో వచ్చిన నాటు సిరీస్
ఎవరికి వారుగా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ నేతలు మాత్రం ఎవరి పక్షం ఉండాలనేది మాత్రం ఇప్పుడు ఆందోళన మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహరిస్తుండటం, సీరియర్ నేతగా, కీలకంగా హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి పక్షం ఉంటే భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటయో తెలియదు. ఒకరి వెంట ఉంటే మరొకరితో ఇబ్బందులు తప్పవని లోలోన మధనపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ అధిష్టానం పిలుపు ఇస్తే ఆ కార్యక్రమంలో ఇద్దరిలో ఎవరు పాల్గొన్న తమకు ఇబ్బంది ఉండదని కానీ వీరే కార్యక్రమాల పేరిట వచ్చి నిర్వహిస్తుండటంతో మాత్రం ఆందోళన మొదలైంది.
పార్టీ బలోపేతం, ఉమ్మడి కార్యచరణ మాత్రం పార్టీ తీసుకోవడం లేదు. కేవలం ఇరువురు అగ్రనేతలు మాత్రం ఎవరికి వారుగా వెళ్తున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా వెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం వ్యక్తిగతంగా బలోపేతం అవుతున్నారు తప్ప పార్టీని మాత్రం స్ట్రెంతం చేయడం లేదని పార్టీలోని సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ITDA Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో.. ఐటీడీఏ ఆసుపత్రులపై అధ్యయనం..?