Crime News : ఈ భార్యలున్నారే. భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. రోజుకో ఘటన. పూటకో న్యూస్. వైఫ్ అంటేనే అనుమానంగా చూసే పరిస్థితులు వచ్చాయి. ఏమీ తెలీనట్టే నటిస్తున్నారు. మహానటిలా జీవిస్తున్నారు. అదును చూసి లేపేస్తున్నారు. కొందరు పెళ్లైన కొత్తలోనే భర్తను ఖతం చేస్తుంటే.. మరికొన్ని కేసుల్లో షష్టిపూర్తి చేసుకున్న భార్య సైతం మొగుడిని హతమార్చిన ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇటీవలి ఇండోర్ హనీమూన్ జంట మర్డర్ కేసు అయితే మరింత దారుణం. పెళ్లైన 10 రోజులకే.. హనీమూన్‌కు తీసుకెళ్లి మరి.. సుపారీ గ్యాంగ్‌తో దారుణంగా భర్తను గొడ్డలితో నరికించి, నదిలో తోసేసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలీనట్టు నంగనాచి వేషాలు వేస్తూ తప్పించుకోవాలని చూసింది. కానీ, పోలీసులకు దొరికిపోయింది. వేరే వాడితో లవ్ ఎఫైర్ ఉంటే పెళ్లెందుకు చేసుకున్నట్టు? అని అడిగితే.. తాను చేసుకోననే చెప్పిందట. తల్లే బలవంతంగా రాజా రఘువంశ్‌తో తాళి కట్టించిందట. ఫస్ట్ నైట్ ఏదో సాకులు చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత హనీమూన్‌లో వేసేసింది. ఇలాంటి ఘటను ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి.
గతంలో ముస్కాన్ ఎపిసోడ్ అయితే ఇంకా భయనకం. లవర్‌తో కలిసి.. మొగుడిని ముక్కలుగా నరికేసి.. డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో పూడ్చేసి.. లవర్‌తో సిమ్లా చెక్కేసింది. అక్కడ డ్రగ్స్ తీసుకుని.. లవర్‌తో రూమ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడింది. సోనమ్, ముస్కాన్‌లే కాదు.. నిఖిత, మనికా, ప్రగతి, ప్రతిమ.. ఇలా చాలామందే ఇటీవల కాలంలో భర్తలను చంపిన భార్యలుగా మగజాతిలో భయం పుట్టించారు. ఈ జాబితాలో లేటెస్ట్‌గా మరో మహిళ యాడ్ అయింది. సోనమ్ లానే భర్తను నదిలో తోసేసి చంపేసింది. ఈమె కేసులోనూ అక్రమ సంబంధమే కారణం.
భర్త హత్యకు స్కెచ్..
40 ఏళ్ల సంగీత.. 30 ఏళ్ల అనిల్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఇద్దరూ కొంత కాలంగా చాటుమాటుగా యవ్వారం నడిపిస్తున్నారు. పార్ట్ టైమ్ కాకుండా ఫుల్ టైమ్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు సంగీత భర్త కన్నన్ అడ్డుగా ఉన్నాడని భావించారు. అప్పటికే అతను అనారోగ్యంతో ఉన్నాడు. రోగిష్టి మొగుడు తనకెందుకు అనుకుంది? భర్తను లేపేస్తే.. ప్రియుడితో గడపొచ్చని అనుకుంది. లవర్స్ ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు. కట్ చేస్తే..
మహానటిలా యాక్టింగ్
జూన్ 2న తన భర్త కన్నన్ కనిపించడం లేదంటూ సంగీత స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. జూన్ 11న తెల్లవారుజామున యూపీలోని బలరాంపూర్ జిల్లాలోని రప్తి నది ఒడ్డున ఓ పురుషుడి డెడ్‌బాడీ లభించింది. ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా చనిపోయింది కన్నన్ అని గుర్తించారు కుటుంబ సభ్యులు. పోలీసులు అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేపట్టగా.. భార్య సంగీతపైనే వారికి డౌట్ వచ్చింది. అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా.. అసలు నిజం చెప్పేసింది. ప్రియుడు అనిల్ శుక్లాతో కలిసి తానే భర్తను చంపేశానని ఒప్పేసుకుంది.
కన్నన్‌కు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ అనిల్‌ను ఇంటికి పిలిపించి.. ఆ ఇద్దరూ కలిసి కన్నన్‌ను వాహనంలో నదీ తీరానికి తీసుకొచ్చి.. నదిలో తోసేశారు. ఆ తర్వాత ఏం తెలీనట్టు ఇంటికెళ్లిపోయారు. డెడ్ బాడీ తీరానికి కొట్టుకురావడంతో బండారం బయటపడింది. లేదంటే.. ఎప్పటికీ మిస్సింగ్ కేసుగానే మిగిలిపోయేదేమో.