BigTV English

Beautiful Waterfalls: జీవితంలో ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్స్ చూడాలి ? ఎందుకంటే..

Beautiful Waterfalls: జీవితంలో ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్స్ చూడాలి ? ఎందుకంటే..

Beautiful Waterfalls: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి సౌందర్యం జలపాతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. జలపాతాల్లో ఎత్తు నుండి నీరు పడటం చాలా అందంగా ఉంటుంది. ఇది మనల్ని రిలాక్స్‌గా , థ్రిల్‌గా చేస్తుంది. ఇలాంటి జలపాతాల ప్రపంచంలో చాలా ఉన్నాయి.


ఎత్తు , సహజ సౌందర్యం వాటిని ప్రత్యేకంగా చేస్తాయి. కొన్ని జలపాతాల ఎత్తు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో.. వాటి అందం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. లోతైన లోయలు, పర్వతాలు, పచ్చదనం గుండా ప్రవహించే ఈ జలపాతాలు సహజ కళకు ఒక ప్రత్యేక ఉదాహరణ. మీరు ప్రకృతి ప్రేమికులైతే , ప్రయాణించే అభిరుచిని కలిగి ఉంటే.. ఖచ్చితంగా ఒకసారి ప్రపంచంలోనే ఎత్తైన , అందమైన జలపాతాలను చూడండి. ప్రపంచంలోని కొన్ని ఎత్తైన , అందమైన జలపాతాలు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంజెల్ జలపాతం, వెనిజులా:
వెనిజులా అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం. ఇక్కడ ఏంజెల్ జలపాతం ప్రవహిస్తుంది. వెనిజులాలోని ఏంజెల్ జలపాతం ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. ఇది వెనిజులాలోని కనైమా జాతీయ ఉద్యానవనంలో ఉంది. దీని ప్రవాహం ఎంత ఎత్తు నుండి పడుతుందంటే.. నీరు అడుగుకు చేరే సమయానికి చిన్న బిందువులుగా మారుతుంది.


దక్షిణాఫ్రికాలోని తుగేలా జలపాతం:
తుగేలా జలపాతం ఎత్తు 3,110 అడుగులు. వర్షాకాలంలో ఈ జలపాతం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తుగేలా జలపాతం రాయల్ నాటల్ నేషనల్ పార్క్‌లోని డ్రేకెన్స్‌బర్గ్ పర్వతాలలో ఉంది.
దీనిని చూడటానికి నిత్యం అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

త్రీ సిస్టర్స్ ఫాల్స్, పెరూ:
పెరూ అనేది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు త్రీ సిస్టర్స్ ఫాల్స్ అనే అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు. ఇది అమెజాన్ వర్షారణ్యం మధ్యలో ఉంది. అంతే కాకుండా మూడు స్థాయిలలో ప్రవహిస్తుంది. అందుకే దీనికి “త్రీ సిస్టర్స్” అని పేరు వచ్చింది. కఠినమైన ట్రెక్కింగ్ , సాహసయాత్రలను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం స్వర్గం లాంటిది.

ఒలుపెనా జలపాతం, హవాయి:
ఒలుపెనా జలపాతం అమెరికాలోని హవాయిలో దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జలపాతం సముద్రం దగ్గర ఉన్న రాళ్ల నుండి నేరుగా వస్తుంది. హెలికాప్టర్ నుండి మాత్రమే దీనిని చూడగలరు.

Also Read: నలుగురు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పై తండ్రి.. గుండె బరువెక్కించే ఘటన!

యుంబిలా జలపాతం, పెరూ:
యుంబికా జలపాతం పెరూలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. ఈ జలపాతం ఇటీవల కనుగొనబడింది. ఇది పెరూ యొక్క లోతైన అడవులలో దాగి ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఇది ప్రసిద్ధి చెందుతోంది. ఈ జలపాతం యొక్క దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×