BigTV English
Advertisement

Rashmika : ఆ ‘కింగ్‌డం’ నాది కాదు… కోపం రష్మిక అలాంటి నిర్ణయం తీసుకుందా..?

Rashmika : ఆ ‘కింగ్‌డం’ నాది కాదు… కోపం రష్మిక అలాంటి నిర్ణయం తీసుకుందా..?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక రష్మిక చివరిగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలను నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 20వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.


రష్మిక మొదటి ఎంపిక…

ప్రముఖు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి పిప్పిపి.. డుండుండుం అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ పాట పెళ్లి పాట అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ పాటలో రష్మిక ఓచోట ‘కింగ్‌డం’ నాట్ ఓన్ అనే లిరిక్ రావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అసలు ఈ పాట ద్వారా రష్మిక ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


ఛాన్స్ ఇవ్వలేదని కోపమా…

ఇలా ఈ పాటలో కింగ్‌డం’ నాట్ ఓన్ అనే లిరిక్ రావడంతో అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పాట ద్వారా రష్మిక ఇలా చెప్పటంతో విజయ్ దేవరకొండకు ఏమైనా మెసేజ్ ఇస్తోందా? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా, మరి కొందరు మాత్రం కింగ్ డమ్ సినిమాలో మొదటగా చిత్ర బృందం రష్మికను హీరోయిన్గా తీసుకోవాలని భావించారు కానీ కొన్ని కారణాలవల్ల రష్మికను ఈ సినిమా నుంచి తప్పించారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదనే కోపంలో రష్మిక ఉందా? ఈ విధంగా హీరోకి కౌంటర్ ఇచ్చిందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ అనే సినిమాలలో నటించారు. ఇలా ఈ రెండు సినిమాలలో వీరి నటన చూసిన ప్రేక్షకులు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలను సృష్టించారు. అయితే ఇప్పటికీ వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్లు బయటకు వచ్చినా, ఇద్దరు మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఇకపోతే వీరిద్దరూ తరచూ వెకేషన్ లకు వెళ్లడం , ఓకే చోట పండుగలు వంటివి జరుపుకోవడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, కానీ ఈ విషయాన్ని బయట పెట్టలేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక వీరికి విషయానికి వస్తే రష్మిక త్వరలోనే కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగ, విజయ్ దేవరకొండ కింగ్ డమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×