E-Paper
Advertisement

Siddipet Crime: అనుమానం వెంటాడింది.. భార్యని కత్తితో పొడిచి చంపిన భర్త, కూతురిపై దాడి

Siddipet Crime: అనుమానం వెంటాడింది.. భార్యని కత్తితో పొడిచి చంపిన భర్త, కూతురిపై దాడి
Advertisement

Siddipet Crime: అనుమానం పెనుభూతమైంది. పచ్చని ఫ్యామిలీలో చిచ్చు రేగింది. ఫలితంగా తట్టుకోలేకపోయాడు భర్త. పట్టరాని కోపంతో భార్యని చంపేశాడు. అడ్డు వచ్చిన కూతురిపై కూడా దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సంచలనం రేపిన ఈ ఘటన సిద్ధిపేట్ జిల్లాలో వెలుగు చూసింది.

సిద్ధిపేట్‌లో దారుణం.. అనుమానం పెనుభూతం

Advertisement

సిద్దిపేట్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీ స్ట్రీట్ నంబర్ 7 ఉంటున్నారు ఎల్లయ్య-శ్రీలత దంపతులు. వీరికి అర్చన అనే కూతురు కూడా ఉంది. హాయిగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. ఫలితంగా భార్య శ్రీలతపై భర్త ఎల్లయ్యకు అనుమానం మొదలైంది. అది కాస్త పెరిగి తారాస్థాయికి చేసింది. భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో భార్యని కత్తితో పొడిచి చంపాడు భర్త ఎల్లయ్య. ఆ తర్వాత అడ్డొచ్చిన కూతురిపై కత్తితో దాడి చేశాడు. కేవలం క్షణాల వ్యవధిలో ఇళ్లంతా ఆ విధంగా చూసి షాకయ్యాడు. అసలు ఫ్యామిలీ లేనప్పుడు తానెందుకని భావించాడు. పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన ఎల్లయ్య, తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గాయాలతోవున్న ఎల్లయ్య, కూతురు అర్చనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

భార్యని కత్తితో పొడిచి చంపిన భర్త, కూతురుపైనా దాడి

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లయ్య నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి. అనుమానం వెనుక కారణం ఎవరు? అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి  మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: హైదరాబాద్‌లో దారుణం.. రాత్రి వేటకొడవళ్లతో దాడి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×