BigTV English

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, విద్యార్థిని నిర్బంధించి, 20 రోజులుగా అఘాయిత్యం

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, విద్యార్థిని నిర్బంధించి, 20 రోజులుగా అఘాయిత్యం

Hyderabad: ఏదైనా అతిగా వ్యవహరిస్తే అనర్థాలు తప్పవని పెద్దలు తరచూ హెచ్చరిస్తారు. ఆ అమ్మాయి విషయంలో అది అక్షరాలా నిజమైంది. అసలే టెక్ యుగం.. చేతిలో సెల్‌ఫోన్ లేని వ్యక్తి ఈ రోజుల్లో మచ్చుకైనా కనిపించరు. సెల్‌ఫోన్ వల్ల మంచే కాదు చెడు లేకపోలేదు. తాజాగా హైదరాబాద్ జరిగిన ఓ అమ్మాయి ఉదంతమే ఇందుకు ఉదాహరణ.


బాధిత అమ్మాయి వయస్సు 20 ఏళ్లు. సొంతూరు నిర్మల్ జిల్లా భైంసా. చేతి‌లో సెల్‌ఫోన్ ఉండడంతో సోషల్‌మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలో గద్వాల్‌కు చెందిన 23 ఏళ్ల కృష్ణ చైతన్యతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. చేతిలో సెల్‌ఫోన్ ఉండడంతో ఇద్దరు గంటల తరబడి ఛాటింగ్‌లో నిమగ్నమయ్యారు. మాటలు కలిశాయి.. కాకపోతే వీరిద్దరు ఒకరి ముఖం మరొకరు చూడలేదు.

ALSO READ: కాన్పూర్ లో రైలు పేల్చివేతకు కుట్ర.. ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ఉంచిన దుండగులు


వీరిద్దరు కలవాలని నిర్ణయించుకున్నారు. దానికి హైదరాబాద్ సిటీని వేదికగా చేసుకున్నారు. ఆన్‌లైన్ ఫ్రెండ్ మాటలు నమ్మి బైంసా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. నారాయణగూడలోని ఓ హైటల్ లో యువతిని నిర్బదించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి రెండురోజులు కాదు.. ఏకంగా 20 రోజులు. ఏమైందో తెలీదుగానీ తాను మోసపోయానని భావించింది బాధితురాలు. అక్కడి నుంచి బయటపడాలని ప్లాన్ చేసింది.

యువతి తన బుర్రకు పదును పెట్టింది. అసలే హైదరాబాద్ సిటీ.. ఆమెకి ఏ ప్రాంతం తెలీదు. నేరుగా తాను ఉన్న ప్రదేశం నుంచి పేరెంట్స్‌కు లొకేషన్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. అంతేకాదు తాను ఇబ్బందుల్లో ఉన్నానని మెసేజ్ పెట్టింది. వెంటనే పేరెంట్స్ హైదరాబాద్ వచ్చి నేరుగా షీ టీమ్స్‌ను ఆశ్రయించారు.

కూతురు వాట్సాప్‌లో పంపిన లోకేషన్ ఆధారంగా అడ్రస్‌ను కనుగొన్నాయి షీ టీమ్స్. నేరుగా హోటల్‌కి వెళ్లి గది తలుపులు తెరిపించి బాధితురాలిని రక్షించారు. తల్లిదండ్రులకు అప్పగించాయి. నిందితుడ్ని స్పాట్‌లో అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఆన్‌లైన్ పరిచయాలతో జాగ్రత్త అంటూ యవతులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×