BigTV English

Hyderabad: మరో దారుణం.. విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు!

Hyderabad: మరో దారుణం.. విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు!

Tution master for sex assault attempt on minor student: దేశంలో రోజురోజుకూ లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు అమలు చేసిన వేధింపులు తగ్గడం లేదు. ఈ వేధింపులు తగ్గేందుకు కేసులు పెడుతున్నా.. దారుణాలు ఆగడంలేదు. రోజురోజుకూ ఈ తరహా కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం బయటకొచ్చింది.


ట్యూషన్ కోసం వెళ్తున్న విద్యార్థినిపై ఆ ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గత కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థిని చెప్పుకొచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ట్యూషన్ కోసమని వెళ్తున్న 10వ తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ రాములు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 15ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ట్యూషన్ వెళ్లినప్పటినుంచి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలిక ఆందోళన చెందింది.


గత మూడు రోజులుగా ట్యూషన్ మాస్టర్ రాములు వేధింపులకు గురిచేస్తున్నాడని, అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకుతూ ఉండడంతో ట్యూషన్ వెళ్లేందుకు ఆలోచించింది. తర్వాత తన తల్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ట్యూషన్ మాస్టర్ చేసిన అఘాయిత్యంపై తల్లికి చెప్పుకొచ్చింది.

వెంటనే బాధితురాలి తల్లి ట్యూషన్ వద్దకు వెళ్లి నిలదీసింది. దీంతో ట్యూషన్ మాస్టార్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు బెదిరింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆందోన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

Also Read: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్..36 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. నిందితుడిపై కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులు తీరుపై విమర్శలు చేస్తున్నారు.

Related News

Honey trap scam: 81 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్ షాక్.. రూ.7.11 లక్షలు మాయం!

Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

Bhadradri Crime: ప్రాణం తీసిన పెళ్లి చూపులు.. యువతిని ఓయోకు తీసుకెళ్లి దారుణం

Delhi Triple Murder: ఢిల్లీలో ఘోరం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు దారుణ హత్య, నిందితుడు కుటుంబసభ్యుడే?

Hydrabad News: మియాపూర్‌లో దారుణం.. ఐదుగురు వ్యక్తులు సూసైడ్, ఏం కష్టమొచ్చింది?

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Big Stories

×