BigTV English

Ganjayi chocolates :ఈజీగా గంజాయి చాక్లెట్లు అమ్మేస్తారక్కడ..

Ganjayi chocolates :ఈజీగా గంజాయి చాక్లెట్లు అమ్మేస్తారక్కడ..

Hyderabad city police caught ganjayi chocolates celler at subash nagar:  గత కొంతకాలంగా భాగ్యనగరం ఇమేజ్ కి డ్యామేజ్ కలిగిస్తున్నాయి డ్రగ్స్, గంజాయి. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా..పోలీసు నిఘా ఎంత కట్టుదిట్టం చేసినా నిత్యం ఏదో ఒక మూల గంజాయి విక్రయాలు జరుగుతునే ఉన్నాయి. పైగా ఏదో మారుమూల ప్రాంతం కాదు సిటీకి నడిబొడ్డునే కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతున్నాయి. చూపులకు ఎట్రాక్టివ్ గా ఈ గంజాయి చాక్లెట్ల రూపంలో లభ్యం కావడంతో ఎవరికీ అనుమానాలు రావడం లేదు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఒకరి ద్వారా మరొకరు తెలుసుకుని ఈ బ్రాండ్ చాక్లెట్లు అడిగి మరీ కొనుక్కుంటున్నారు. కొనుగోలు దారులు కూడా తెలివిగా వీటిని ఎవరికి పడితే వారికి అమ్మడం లేదు. వీటి పేరు చెబితేనే అమ్ముతున్నారు. అంటే ఆదో కోడ్ మాదిరిగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు యూనివర్సిటీ, పేరున్న ధనవంతుల బ్రాండ్ స్కూళ్ల వద్ద రహస్యంగా అమ్మకాలు సాగించేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా కిరాణా షాపులలోనే యథేచ్ఛగా అమ్ముస్తున్నారు ప్రబుద్ధులు. తల్లిదండ్రులు, పలువురు ఇచ్చిన కంప్లైట్స్ ఫలితంగా నెల రోజులుగా పోలీసులు కంటిమీద కునుకులేకుండా నగరమంతా గాలిస్తున్నారు.


5 ప్యాకెట్లు స్వాధీనం

ఈ క్రమంలో జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు అత్యంత చాకచక్యంతో నిందితులను పట్టుకున్నారు. ఈ అమ్మకాలపై పోలీసులకు కీలక సమాచారం అందాకే రైడింగ్స్ కు పాల్పడ్డారు. దాదాపు 200కు పైగా గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. షాపు యజమాని వర్కర్ పై నెట్టేసి పారపోదామనుకున్నాడు. అయితే అతని ప్రమేయం కూడా ఉన్నదని తేలడంతో షాపు యజమాని పివేష్ పాండే పై కేసు నమోదు చేశారు. ప్యాకెట్ కు 40 చొప్పున 5 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు గత 8 నెలలుగా ఎవరికీ తెలియకుండా..గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.


Related News

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Big Stories

×