Hyderabad Crime : హైదరాబాద్ లోని నారాయణ గూడలో యజమాని ఇంట్లో లేని సమయంలో చేతివాటం చూపించిన బీహారీ గ్యాంగ్ ముఠాను హైదారాబాద్ పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అపహరణకు గురైన సొమ్ములతో పాటుగా నిందితుల్ని సినిమాల్లో స్టైల్లో అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ జరిగిన విషయం గురించి తెలిసినప్పటి నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. నిందితుల్ని రాష్ట్రాలు దాటకు ముందే అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.5 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలను రికవరీ చేశారు. ఈ విషయమై.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా సమావశం ఏర్పాటు చేశారు. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఓల్డ్ సిటీ, బహదూర్ పురాలో ఆయిల్ వ్యాపారంలో నిర్వహించే కేడియా కుటుంబం.. కూతురి పెళ్లి కోసం ఫిబ్రవరి 11న దుబాయ్ వెళ్లారు. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఇంట్లో పని చేస్తున్న సుశీల్ ముఖ్యా అనే వ్యక్తి.. యజమాని ఇంట్లో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని.. ఇంట్లో సొత్తును అపహరించేందుకు పన్నాగం పన్నారు. బీహార్ లోని తన గ్రామం నుంచి మరో ఇద్దర్ని పిలిపించుకుని.. ఇంటి తాళాలు, గది తాళాలు పగులగొట్టి లాకర్ ను తెరిచారు. అందులో.. యజమాని ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న బంగారం, వజ్రాలు సహా భారీగా నగదును అపహరించుకుపోయారు. ఈ విషయాన్ని.. ఇంట్లో సిబ్బంది గమనించి, యజమానికి విషయం తెలుపగా.. వారు పోలీసుల్ని ఆశ్రయించారు. విషయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్పందించిన పోలీసులు.. వెంటనే దొంగల్ని పట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
దొంగలకు పోలీసుల షాక్..
కేసు తీవ్రత దృష్ట్యా.. ఈ దొంగతనం కేసుపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కేసును అప్పగించడంతో.. వారు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దొంగతనం జరిగిన తర్వాత నిందుతుల కోసం సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా.. ఇంట్లోని పనివాళ్లే దొంగలుగా తేలింది. దాంతో.. వారి ఎటువైపు వెళ్లారనే విషయాన్ని పరిశీలించగా.. చోరి చేసిన తర్వాత వాళ్లంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లుగా కనుక్కున్నారు. దాంతో.. ఆ రైలు కంటే ముందుగానే వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకున్న పోలీసు బృందాలు.. దొంగలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
దొంగలు రైల్లో, పోలీసులు ఫైట్లో.. చివరకి
కేడియా అనే వ్యాపారి ఇంట్లో చేసిన చోరీలో రూ.3 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చోరికి గురికాగా.. మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రూ.5 కోట్లు ఉంటాయని తెలిపింది. దొంగలు సికింద్రాబాద్ చేరుకున్న నేపథ్యంలోనే రైల్లోనే ఉండే అవకాశాలున్నాయని భావించి.. మూడు బృందాలుగా ఏర్పడి విమానాల్లో వేరువేరు ప్రాంతాలకు చేరుకున్నారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆగే.. భోపాల్, నాగ్ పూర్, పాట్నా స్టేషన్లకు చేరుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే జీఆర్పీ పోలీసుల సహాయంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు నిందితుల్ని గుర్తించారు. దాంతో.. అన్ని వైపుల నుంచి వారిని చుట్టుముట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు.
ఈ భారీ చోరి కేసులో ఏ1 గా మోల్హూ ముఖ్యా, సుశీల్ ముఖ్యా, దసంత్ అర్హీ.. అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి స్పాట్ లోనే 1.42 కేజీల బంగారం, 710 గ్రాముల 3300 క్యారెట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. దొంగలను చాలా చాకచక్యంగా చేధించినట్లు తెలిపిన హైదరాబాద్ సెంట్రల్ పోలీసులు.. ఇలా గంటల వ్యవధిలోనే అతిపెద్ద దొంగతనాన్ని చేధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి రికవరీ చేసిన తర్వాత సుశీల్, అతని సహచర్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు.
దొంగతనాలు చేస్తారు.. ఈ గ్రామానికి చేరతారు.
నిందుతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. అక్కడి మధుబని జిల్లాకు చెందిన బిరోద్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరంతా.. ముఖ్యా జాతికి చెందిన వ్యక్తులేనని తెలిపిన పోలీసులు.. వీరందరి వృత్తి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనులకు చేరిపోయా.. దొంగతనాలకు పాల్పడడమే అంటున్నారు. వీరికి దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వీళ్లు ఓసారి దొంగతనం చేసిన తర్వాత గ్రామానికి మాత్రం వెళ్లరని తెలిపారు. పరిస్థితులు అంతా శాంతించిన తర్వాతే సొంత ఊర్లకుఅడగుబెడతారని తెలిపారు.
Also Read :