Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల(Upasana Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్(Ram Charan) ను పెళ్లి చేసుకున్న సమయంలో ఉపాసన ముఖం చూసి ఎంతోమంది ట్రోల్ చేశారు. అసలు చరణ్ కు తగ్గ జోడి కాదని.. డబ్బు కోసమే మెగా ఫ్యామిలీ ఆమెను కోడలిగా చేసుకుందని వార్తలు కూడా వినిపించాయి. అలాంటివేమీ పట్టించుకోకుండా చరణ్ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. ఇక ఉపాసనమెగా కోడలిగా.. అపోలో హాస్పిటల్ స్ లో కీలక బాధ్యతలు చూసుకుంటూ లేడీ బాస్ గా మారింది. ఇక ఆమె సమాజ సేవ చూసి ట్రోల్ చేసిన వారే ఆమెను పొగడడం మొదలుపెట్టారు.
ఇక దాదాపు పదేళ్ల తరువాత చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా మారారు. 2023 లో క్లింకార పుట్టింది. మెగా ఇంట లక్ష్మీదేవినే పుట్టింది అని చెప్పొచ్చు. ఆమె పుట్టిన వేళా విశేషం.. మెగా ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. కూతురు పుట్టాకా చరణ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఒక్క నిమిషం కూడా కూతురును వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చాడు అంటే అతిశయోక్తి కాదు.
ప్రతి ఏడాది ప్రేమికుల రోజు వచ్చిందంటే.. టాలీవుడ్ సెలబ్రిటీలు తమ భార్యలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేడు ప్రేమికుల రోజు కావడంతో ఉపాసన.. వాలెంటైన్స్ డే(Valentines Day) గురించి ఒక పోస్ట్ పెట్టింది. ఏముంటుందిలే.. చరణ్ రేర్ పిక్ పోస్ట్ చేస్తూ.. తన ప్రేమను వ్యక్తపరిచి ఉంటుంది అనుకుంటే పొరపాటే. అసలు వాలెంటైన్స్ డే ఎవరు చేసుకుంటారో చెప్పుకొచ్చింది.
Akhanda 2: బాలయ్య సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?
” వాలెంటెన్స్ డే 22 ఏళ్ళు.. దానికన్నా కింద వయస్సు ఉన్నవారు జరుపుకొనేది. ఒకవేళ మీరు ఆ వయస్సు దాటినవారు అయితే.. ఆంటీ.. మీరు ఉమెన్స్ డే(Women’s Day) కోసం ఎదురుచూడండి” అని రాసుకొచ్చింది. మాములుగా ఉపాసన ఏం చెప్పింది అంటే.. 22 ఏళ్ళ తరువాత అమ్మాయిలు.. మహిళలుగా మారతారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకోరు అనే అర్ధంలో చెప్పుకొచ్చింది. ఇది ఉపాసన సరదాకే అన్నా కూడా.. కొంతమంది మహిళలు సీరియస్ గా తీసుకుంటున్నారు. అంటే.. 23 ఏళ్లు ఉన్నవారు ఆంటీలు అయిపోతారా.. ? ఏం మాట్లాడుతున్నావ్ ఉపాసన అంటూ కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.
30 దాటినా వాళ్ళను ఆంటీ అంటేనే ఎవరు కోరుకోవడం లేదు. కానీ, ఉపాసన మాత్రం 23 ఏళ్లకే ఆంటీ అయ్యినట్లు చెప్తుంది. ఇది ఆ వయస్సులో ఉన్నవారిని అవమానించడం కాదా.. ? ఎంత ధైర్యం ఆమెకు అని కొందరు అమ్మాయిలు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.