E-Paper
Advertisement

Hyderabad School Students Fight: స్కూల్ పిల్లల మధ్య వివాదం.. బస్తీలో గ్యాంగ్ వార్.. కర్రలు, రాళ్లతో దాడులు!

Hyderabad School Students Fight: స్కూల్ పిల్లల మధ్య వివాదం.. బస్తీలో గ్యాంగ్ వార్.. కర్రలు, రాళ్లతో దాడులు!
Advertisement

Hyderabad School Students Fight: హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక్ నగర్ బస్తీలో పాఠశాల విద్యార్థుల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు గ్యాంగ్ వార్ తరహాలో రోడ్ల మీద పడి పరస్పరం దాడులు చేసుకోవడం స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.

పాఠశాల విద్యార్థుల మధ్య తలెత్తిన ఒక చిన్నపాటి వివాదం ముదిరి రెండు వర్గాల మధ్య ఘర్షణకు మూలమైంది. యువకులు, విద్యార్థులు రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి బహిరంగంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. వీధుల్లో యువకులు వీరంగం సృష్టిస్తుండటంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారు కూడా యువకుల దూకుడు చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

Advertisement

విద్యార్థుల మధ్య మొదలైన ఈ గొడవలో బయట వ్యక్తులు కూడా ప్రవేశించడంతో పరిస్థితి మరింత చేయి దాటిపోయింది. సమాచారం అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు మెరుపు వేగంతో ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారకులైన పలువురు యువకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బస్తీలో మళ్లీ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Read Also: Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×