E-Paper
Advertisement

కేపీహెచ్‌బీలో ఘోర విషాదం.. పెళ్లి బట్టల్లోనే వరుడు ఆత్మహత్య!

కేపీహెచ్‌బీలో ఘోర విషాదం.. పెళ్లి బట్టల్లోనే వరుడు ఆత్మహత్య!
Advertisement

Groom Suicide: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బట్టలు ధరించి, వివాహ వేడుకకు సిద్ధమవ్వాల్సిన సమయంలో ఓ యువకుడు హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్టలో ఉన్న ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు.

Advertisement

వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో లోకేష్ తన ప్రియురాలిని భోజనం తీసుకురావాలని బయటకు పంపాడు. ఆమె బయటకు వెళ్లిన కొద్దిసేపటికే, గదిలో ఒంటరిగా ఉన్న లోకేష్ తాను ధరించిన పెళ్లి బట్టలతోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతి తిరిగి వచ్చేసరికి లోకేష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలాంటి విపరీత నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారంలో ఏవైనా విభేదాలు ఉన్నాయా లేక మరేదైనా ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో లోకేష్ కుటుంబ సభ్యులు , స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక నిండు ప్రాణం అర్ధాంతరంగా ముగిసిపోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది.

Advertisement

Also Read: ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×