E-Paper
Advertisement

ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

AVN Global Schools: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఏవీఎన్ విద్యాసంస్థల క్యాంపస్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దశల వారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం చేయబోతున్నాము అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గల్లో రూ.20వేల కోట్ల వ్యయంతో మొదటి దశలో పనులు చేపట్టగా 59 స్కూల్స్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రతి స్కూల్స్ 25 ఎకరాల్లో 5లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడెం రోడ్డులో ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్య విస్తరణ

ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర వచ్చినప్పుడు నిరక్ష్యారాస్యత, ఆకలి కేకలు వినడం జరిగిందని గుర్తు చేశారు. మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు విద్య, సాగునీటి అంశాలపైన దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు. దాంతో ప్రతి పేదవాడికి విద్య అందుబాటులోకి వచ్చిందని… అంతే కాకుండా ప్రతి ఒక్కరూ తమ పేరునైనా నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో వయోజన విద్యను గ్రామాల్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభావం

ఇరిగేషన్ ప్రాజెక్టులతో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ సాగు నీటిని నిర్మించి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. ఈలాంటి ప్రాజెక్టులతో దేశానికి అవసరమున్న ధాన్యమే కాకుండా ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. దేశంలో విద్య లేని ప్రాంతం లేదు… ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉందన్నారు. విద్య అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యం తెలిపారు. వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయానే అభద్రతను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్య సమస్యలు

రాష్ట్రంలో ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యతో 1,10,000 మంది పాసైతున్నారని.. ఇందులో ఎంత మందికి సర్టిఫికెట్ కు తగట్టుగా స్కిల్స్ ఉన్నాయనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. నాణ్యమైన విద్య లేకపోవడంతోనే ఉపాధి కోల్పోతున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6వ తరగతి విద్యార్థులల్లో 3వ తరగతి పుస్తకాలు చదివే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 6వ తరగతిలో కేవలం 6.78శాతం మాత్రమే ఆ స్థాయి విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం బడ్జెట్లో రూ.27కోట్లు అంటే 8.3 శాతం ఖర్చు చేస్తుందన్నారు.

ప్రతి విద్యార్థిపై ఖర్చు

ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి పై ఏడాదికి రూ. లక్ష 8వేలు ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. ఇందుకు కారణం ప్రయివేట్ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచే ఉండటంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటారని తెలిపారు. అదే పద్దతిలో ప్రభుత్వ స్కూల్స్లో వచ్చే అకాడమీ నుంచే ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చూడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూల్స్ ఉంటే 18లక్షల పిల్లలుండగా అదే 11వేల ప్రయివేట్ స్కూల్ ఉంటే 33లక్షల విద్యార్థుల ఉండటం పై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. ఎక్కడ విఫలం చెందరానే విషయంపై ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని అన్నారు.

తరగతి గది పరిస్థితులు

ప్రదానంగా సాంకేతిక నైపుణ్యం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో 55ప్రశ్నలతో నిజాలు బయటికి వచ్చాయని అన్నారు. ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ విద్య లేకపోతే సమాజంలో వెనుకబడినట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా ఉంటే టీచర్ భోదించేందుకు ఆసక్తిగా ఉంటారని అన్నారు. ఇదే నియోజకవర్గంలో ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో సమికృతంగా నడిపిస్తున్న ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు తగట్టుగా విద్య బోధన జరుగుతుందని అన్నారు. ఈ స్కూల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు 1500ఉంటే 3500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ప్రత్యేక విద్యా పాలసీ

విద్యతోపాటు క్రీడాలో కూడా విద్యార్థుల చురుకుగా ఉండాలని అన్నారు. అందుకు అనుగుణంగా స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక విద్య పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శశానమండలి చైర్మన్ గుత్తా సుకెందర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్, డీకే అరుణ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×