E-Paper
Advertisement

Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద చోటుచేసుకుంది. నిజాంపేట ప్రాంతంలోని వర్టెక్స్ ప్రైమ్ అపార్టమెంట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి అర్జున్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల సమాచారం ప్రకారం.. అర్జున్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఉన్నారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుంగా జారి పడినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు బాలుడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

సమాచారం అందుకున్న కేపీఎహె‌చ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతి పట్ల స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అపార్ట్‌మెంట్‌లు, నివాస సముదాయాల్లో పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన భద్రతా చర్యలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×