E-Paper
Advertisement

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు!

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు!
Advertisement

Nampally: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఒక రైలు ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నాంపల్లి స్టేషన్‌లో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి అటుఇటు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే అధికారులు, పోలీసులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రమాద స్థలాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌లో కాసేపు తీవ్ర గందరగోళం, ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Also Read: విజయ్‌తో పోలిక.. వైసీపీకి ఇచ్చిపడేసిన పవన్.. ఏమన్నారంటే?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×