E-Paper
Advertisement

Hyderabad Tragedy: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థి మృతి

Hyderabad Tragedy: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థి మృతి
Advertisement

Hyderabad Tragedy: హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత స్కూల్ ట్రిప్ లో భాగంగా పిల్లలను వండర్ లా కి తీసుకెళ్లారు. అయితే వయసుకి మించి యాక్టివిటీస్, గేమ్ ఆడించడంతో 8వ తరగతి విద్యార్థి దమరుక్ సూర్యతేజ కింద పడి అపస్మార్క స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స సూర్యతేజ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మహారాష్ట్రలో మరో ఘటన

మహారాష్ట్రలోని జల్నాలో 13 ఏళ్ల 8వ తరగతి విద్యార్థిని పాఠశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకి మరణించింది. విద్యార్థిని మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఓ పాఠశాలలో జరిగింది. బాలిక పాఠశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకింది. పాఠశాల యాజమాన్యం బాలిక తండ్రికి సమాచారం అందించారు. అతను వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. బాలికను మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపై జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలిక మరణించినట్లు ప్రకటించారు.

బాలిక ఆత్మహత్యపై ఆరా

Advertisement

ఈ ఘటనపై సమాచారం రాగానే పోలీసులు స్కూల్ క్యాంపస్‌కు చేరుకుని స్పాట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

Also Read: Amberpet Tragedy: హైదరాబాద్‌లో కలకలం.. మూఢనమ్మకమా? మనోవేధనా? ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.

Advertisement

ఉపాధ్యాయుల మానసిక వేధింపుల వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తండ్రి ఆరోపించారు. బాలిక చాలా రోజులుగా బాధపడుతోందని, అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేదని ఆయన అన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×