E-Paper
Advertisement

OTT Movie : భర్త ఉండగానే మరొకరిని రెచ్చగొట్టే భార్య… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ మావా… క్లైమాక్స్ ట్విస్ట్ కేక

OTT Movie : భర్త ఉండగానే మరొకరిని రెచ్చగొట్టే భార్య… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ మావా… క్లైమాక్స్ ట్విస్ట్ కేక
Advertisement

OTT Movie : ప్రేమలో మోసాలు, మర్డర్ మిస్టరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన సినిమా ‘హసీన్ దిల్ రుబా’. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను, థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఒక పెళ్ళయిన యువతి, అక్రమ సంబంధంలోకి ఎలా దిగుతుంది ? భర్త మర్డర్ కి ఎలా స్కెచ్ వేస్తుంది ? అనే థీమ్స్ తో ఈ కథ నడుస్తుంది. తెలుగులో ఒక మెరుపు మెరిసి, బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అందాల భామ తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ‘హసీన్ దిల్ రుబా’ ఓ మోస్తారు విజయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లో కివెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2021లో విడుదలైన ఈ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ వినీల్ మాథ్యూ డైరెక్షన్ లో కనికా ధిల్లోన్ నవల ‘ది ఫోల్స్’ ఆధారంగా వచ్చింది. ఇందులో తాప్సీ పన్ను (రానీ), విక్రాంత్ మాస్సీ (రిషు), హర్షవర్ధన్ రాణే (నీల్) ప్రధాన పాత్రల్లో నటించారు. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 6.9/10 రేటింగ్ ని పొందింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 2021 జూలై 2 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. దీనికి సీక్వెల్ గా ‘ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా’ 2024లో వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రానీ కశ్యప్ (తాప్సీ పన్ను) అనే అందమైన అమ్మాయికి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. రిషభ్ సక్సేనా అలియాస్ రిషు (విక్రాంత్ మాస్సీ) అనే ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంటుంది. రిషు కూడా చూడటానికి బాగానే ఉంటాడు కానీ మాటలు తక్కువ. పెళ్లి అయిన మొదటి రోజు నుంచే రానీకి అతనంటే బోర్ కొట్టేస్తుంది. నేను కలలు కన్నది ఇలాంటి వాడి కోసమేనా అని డిప్రెషన్ అవుతుంది. రిషు రాత్రి రొమాన్స్‌కి ట్రై చేసినా రానీ తలనొప్పి అని తప్పించుకుంటుంది. ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు నీల్ త్రిపాఠి (హర్షవర్ధన్ రాణే) అతను రిషు కజిన్, బయటి సిటీ నుంచి వచ్చిన హ్యాండ్‌ సమ్ అండ్ బ్యాడ్ బాయ్. నీల్ రానీని చూసి ఫ్లర్ట్ చేయడం మొదలెడతాడు. రానీకి ఒక్కసారిగా కరెంట్ తగిలినట్టు, ఇతనే నా హీరో అని ఫిక్స్ అవుతుంది.

Read Also : దెయ్యం నుంచి ఓనర్‌ను రక్షించే డాగ్… ఇలాంటి హర్రర్ మూవీని మీ లైఫ్‌లో చూసుండరు భయ్యా

Advertisement

ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ స్టార్ట్ చేస్తారు. రాత్రి రైల్వే ట్రాక్ మీద కలుసుకోవడం, ఫోన్ లో కూడా బిజీగా గడుపుతారు. రిషుకి కొంచెం కొంచెం అనుమానం వస్తుంది. ఇంతలో ఒక రోజు ఇంట్లో ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ పేలి రిషు శరీరం ముక్కలు ముక్కలుగా దొరుకుతుంది. పోలీస్ కేసు స్టార్ట్ అవుతుంది. అన్ని బాణాలు రానీ మీదే పడతాయి. భార్యే భర్తని చంపేసినట్టు కేసు నమోదవుతుంది. రానీని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తారు. అయితే నీల్ కూడా మిస్టీరియస్‌గా మిస్సింగ్ అవుతాడు. ఇక చివరో 40 నిమిషాలు ఒక్కసారిగా ట్విస్ట్ మీద ట్విస్ట్ లు వస్తాయి. రానీ నిజంగా కిల్లరా? లేక ఇది పెద్ద మోసమా? ఇంటరాగేషన్ లో ఎలాంటి విషయాలు బయట పడతాయి ?
ఇందులో నీల్ పాత్ర ఎంత అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×