E-Paper
Advertisement

Hyderabad News: మూడో అంతస్తు నుంచి బిడ్డని విసిరేసిన కన్న తల్లి.. హైదరాబాద్‌లో దారుణం

Hyderabad News: మూడో అంతస్తు నుంచి బిడ్డని విసిరేసిన కన్న తల్లి.. హైదరాబాద్‌లో దారుణం
Advertisement

Hyderabad News: ఫ్యామిలీ సమస్యలా? లేకుంటే అనారోగ్య కారణమా అనేది తెలీదు. కారణాలు ఏమైనా కావచ్చు. మూడవ అంతస్తు భవనం నుంచి బిడ్డను కిందికి విసిరేసింది కన్న తల్లి. ఈ ఘటన హైదరాబాద్ సిటీలో జరిగింది. ఈ ఘటనలో చిన్నారి స్పాట్‌లో మృత్యువాతపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన

Advertisement

లోకంలో తల్లి ప్రేమ నిజమైంది..స్వార్థం లేనిదంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు ఎదురైనా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఇటీవల కాలంలో తల్లులే బిడ్డల పాలిట యముడిగా మారిపోతున్నారు. అందుకు ఉదాహరణ తాజాగా మేడ్చల్‌ మల్కాజ్‌‌గిరి ప్రాంతంలో జరిగిన ఘటన. వసంతపురి కాలనీలో ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత కర్కశంగా హత్య చేసింది.

ఏడేళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. మల్కాజ్‌గిరి వసంతపురి కాలనీలో మోనాలిసా అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఏడేళ్ల షారోని మేరి కూతురు ఉంది. ఉన్నట్లుండి ఏమైందో తెలీదుగానీ ఆ చిన్నారిని తల్లి మోనాలిసా మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది.

Advertisement

మూడో అంతస్తు నుంచి బిడ్డని విసిరిన తల్లి

ఈ ఘటనలో షారోని మేరీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరుగుపొగురువారు అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు.  వెంటనే చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే తల్లి మోనాలిసా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా బాగానే ఉన్నారని, తాము ఎప్పుడూ మాట్లాడలేదని ఆ ఫ్లాట్‌లో ఉన్న మరో మహిళ చెప్పింది.

ఈ ఘటన వెనుక ఫ్యామిలీ సమస్యలు ఏమైనా కారణం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కన్న తల్లి తన ఇద్దరు పిల్లలను భవనం పైనుంచి కిందకు తోసేసింది. అది మరుకముందే ఆ తరహా ఘటన జరగడంపై కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సివుంది.

ALSO READ: గ్రామ పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల ఫైటింగ్

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×