BigTV English

Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో టెక్కీ సూసైడ్, ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని, ఆపై ఏం జరిగిందంటే..

Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో టెక్కీ సూసైడ్, ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని, ఆపై ఏం జరిగిందంటే..

Hyderabad Techie Suicide: ఆ దంపతుల మాటా మాటా పెరిగింది. మహిళ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, ఆమె భర్త కాంట్రాక్టర్. ఏమైందో తెలీదుగానీ ఇద్ధరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరి కోపం రెట్టింపు అయ్యింది.. అది ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుంచి ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించినప్పటికీ ఫలితం లేదు. చివరకు ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని సూసైడ్ చేసుకుంది ఆ టెక్కీ. ఇంతకీ.. ఎవరు, ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.


మహిళ పేరు వెంకట నాగలక్ష్మి, వయస్సు సుమారు 29 ఏళ్లు. ఈమె సొంతూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. చాట్రాయి మండలానికి చెందిన ఈమె, హైదరాబాద్‌తో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఇక ఆమె భర్త విషయానికొద్దాం. ఐదు నెలల కిందట నాగలక్ష్మికి సొంత జిల్లా ముసునూరు మండలానికి చెందిన మొవ్వ మనోజ్ మణికంఠతో వివాహం జరిగింది.

తొలుత ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు సొంతూరుకి వెళ్లినా, ఈ జంటను చూసి ఇరుగుపొరుగువారు ముచ్చట్లు పెట్టుకునేవారు. చూడ ముచ్చటగా ఆ విధంగా ఉండేవారు. ఇక మనోజ్ కాంట్రాక్టర్. మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు.


ఈ దంపతుల మధ్య మాటా మాటా పెరిగింది. కానీ, ఈ విషయం పెద్దలకు తెలీదు. చివరకు మనస్పర్థలు తీవ్రమయ్యాయి. రోజురోజుకూ ఫ్యామిలీ సమస్యలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గుముఖం పట్టడం లేదు. ఆవేశానికి లోనైన టెక్కీ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు సంబంధించి మెటీరియల్‌ను గత నెల 26న ఆన్‌లైన్‌లో తెప్పించుకుంది.

ALSO READ:  హైదరాబాద్‌లో దారుణం.. భార్య, కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య

ఇలాంటి జీవితం తనకు వద్దని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న విషం బుధవారం తాగింది. వెంటనే గమనించిన ఇంటి యజమాని, ఆమె కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆ టెక్కీ మృతి చెందింది.

ఈ విషయం తెలియగానే కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. భర్త వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి నాగలక్ష్మి ఆత్మహత్య వెనుక ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×