Crime News: హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం జరిగింది. భార్య, చిన్న కొడుకుని చంపిన సిరాజ్ అనే వ్యక్తి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బారి నుంచి పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. భార్య గొంతు కోసి, కొడుకు గొంతు నులిమి.. ఇద్దర్నీ చంపేశాడు సిరాజ్. తండ్రి వాళ్లను చంపుతున్నప్పుడు చూసిన పెద్దకొడుకు… తప్పించుకుని వెళ్లిపోయాడు. ఇద్దర్నీ చంపాక సిరాజ్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ కుటుంబం యూపీ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బేగంబజార్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని హతమార్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే అతని ఫ్యామిలీని ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాహాద్ తీసుకొచ్చాడు. గత కొన్నేళ్లగా పాతబస్తీలోని గాజుల తయారీలో సిరాజ్ పనిచేస్తున్నాడు. యూపీలోని సొంత ఊరిలో ఉంటున్న భార్యా, పిల్లల్ని ఈ మధ్యన సిటీకి తీసుకుని వచ్చాడు. అయితే హైదరాబాద్‌లో కాపురం పెట్టినప్పటి నుంచి భార్యా, భర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో క్షణికావేశంలో భార్యను కత్తితో గొంతుకోసి, చిన్న కుమారుడు గొంతు నులిమి హత్య చేశాడు.
Also Read: మనవరాలితో తాత అసభ్య ప్రవర్తన.. కువైట్ నుంచి వచ్చి మరీ మర్డర్, ఆ వీడియో చూసి పోలీసులకే షాక్!
తల్లి రక్తపు మడుగుల్లో, తమ్ముడుని గొంతునులుముతుండడంతో భయపడిన సిరాజ్ పెద్ద కొడుకు.. పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు.. ఆ పిల్లాడి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సిరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి మృతిదేహాలను గాంధి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.