BigTV English

Domalaguda Gold Robbery: గన్‌ గురి పెట్టి.. రూ.2 కోట్లు విలువ చేసే బంగారం దోపిడీ, నిఘా కెమేరాకు చిక్కిన ఘటన

Domalaguda Gold Robbery: గన్‌ గురి పెట్టి.. రూ.2 కోట్లు విలువ చేసే బంగారం దోపిడీ, నిఘా కెమేరాకు చిక్కిన ఘటన

ఇప్పటికే క్లూస్ టీమ్‌ ఆధారాలను సేకరించింది. బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. బాధితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితుడు ఇంట్లోకి దుండగులు చొరబడటంతో తెలిసినవారే ఈ తరహా ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బెంగాల్‌కి చెందిన ఇంద్రజిత్, రంజిత్ ఇద్దరు అన్నదమ్ములు.. కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్ల క్రితమే నగరానికి వచ్చి బంగారం వ్యాపారం పెట్టుకున్నారు. “ఎమ్మెస్ గోల్డ్ వర్క్ షాప్” పేరుతో గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది పనివాళ్లతో ఆర్డర్లపై బంగారం ఆభరణాలు తయారు చేయించి.. జ్యూలెరీ షాప్‌లకు పంపిస్తుంటారు. మాస్కులు ధరించిన కొంతమంది దుండగులు.. గురువారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో ఇంద్రజిత్ ఇంట్లో చోరీకి దిగారు. అక్కడ అంతగా సొత్తు కనిపించకపోవడంతో అతన్ని తీసుకుని పక్క ప్లాట్‌లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకుని వచ్చారు. తలుపు కొట్టడంతో వాళ్లు కిటికీలోంచి బయటకు చూశారు.


Also Read:  బీఆర్ఎస్ మెడకు భూదాన్ భూముల స్కామ్, మాజీ ఎమ్మెల్యేతోపాటు బిల్డర్లకు ఈడీ నోటీసు

డోర్ తీయకుంటే మీ తమ్ముడిని చంపేస్తామని బెదిరించడంతో.. అతను తలుపు తీసి బెడ్ రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. దీంతో దుండగలు తలుపులు బద్దలు కొట్టి రంజిత్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. ఆయన సతీమణి దగ్గరకు వెళ్లి బంగారం ఇవ్వు.. లేదంటే చంపేస్తామని బెదిరించి బీరువా ఓపెన్ చేసి, 2.5 కిలోల బంగారం, మూడు ముబైల్స్ , ఐట్యాబ్ చోరీ చేశారు. శుక్రవారం ఉదయం దోమలుగూడా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించి చుట్టు ప్రక్కల ప్రాంతంలో సీసీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

 

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×