BigTV English

Guntur Incident: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. కాళ్లు నరికి.. రైల్వే పట్టాలపై..

Guntur Incident: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. కాళ్లు నరికి.. రైల్వే పట్టాలపై..

Guntur Incident: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కాళ్లు తెగిపోయి, చేతులకు తీవ్ర గాయాలై ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.


యువకుడి ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం..
చేబ్రోలు మండలం, గరువు పాలేనికి చెందిన కొమ్మల కిరణ్ తేజ, రేపల్లె మండలం పెనుమూడి గ్రామానికి చెందిన ధారా వసంత గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరు చేబ్రోలు నుండి పొన్నూరు వచ్చి జీవనం సాగిస్తున్నారు. గరువుపాలెం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌లో నాలుగేళ్లుగా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నారు. అయితే.. ఇటీవలె వీరి మధ్యలోకి రాజు అనే యువకుడు వచ్చాడు. అమ్మాయితో పరిచయం పెంచుకొని స్నేహంగా ఉంటున్నాడు. దీంతో.. రాజుతో నీవు ఎందుకు స్నేహంగా ఉంటున్నావని యువతిని ప్రశ్నించాడు తేజ. దీంతో వసంతకు, కిరణ్‌కు మధ్య కాస్త మనస్పర్థాలు మొదలయ్యయి.

కొమ్మల కిరణ్ తేజపై దాడి చేసిన ధారా గోపి, రాజు
అమ్మాయిని ప్రశ్నించడంతో కొమ్మల కిరణ్ తేజపై ఆమె బంధువులు దాడి చేశారు. ధారా వసంత సోదరుడు ధారా గోపితోపాటు రాజు కలిసి మద్యం మత్తులో కొమ్మల కిరణ్ తేజ కాళ్లు, చేతులు నరికారు. రైల్వే ట్రాక్‌పై పడేశారు. రెండు రోజుల క్రితం రైల్వే ట్రాక్ పై రెండు చేతులు, ఒక కాలు కోల్పోయి పడిపోయిన కిరణ్‌ను అక్కడి సమీపంలోని స్థానికులు గుర్తించి అతని దగ్గర డిటైల్స్ తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వెళ్లి కిరణ్‌ను జీజీహెచ్‌ కి తరలించారు. ప్రస్తుతం కిరణ్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


ఈ ఘటనపై కిరణ్ తెలిపిన వివరాలు..
అయితే బంధువులు కిరణ్ తేజను వివరాలు అడగగా “వసంతను నేను ప్రేమించాను.. కానీ రాజు అనే వ్యక్తితో నాకు వివాదం ఏర్పడింది. అంతేకాకుండా వసంత బంధువులు కూడా నన్న బెదిరించడం జరిగింది. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందని అడగగా.. ఈ సంఘటన ముందు జరిగినది అంతా నాకు గుర్తుంది కానీ, తర్వాత జరిగింది ఏది నాకు గుర్తు లేదు అని చెప్పాడు. అంతేకాకుండా స్థానికులు చూసిన అతనిని వివరాలు అడిగినప్పడు నాకు మత్తు ఒదిలి స్థానికులు అడిగిన వివరాలు చెప్పాను అని తెలిపారు”.

Also Read: భారీ వర్షంతో ధ్వంసమైన హుస్నాబాద్.. ఇళ్లలోకి నీళ్లు

కిరణ్ తేజపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరిన కుటుంబసభ్యులు
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అసలు ఇది ఎవరు చేశారు?.. ఏం జరిగింది? కిరణ్, వసంత మధ్యలోకి వచ్చిన రాజు చేశాడా..? లేదంటే వసంతనే చేయించిందా..? ప్రస్తుతం అందరు అంటున్నట్లుగా వసంత కుటుంబ సభ్యులే చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, కిరణ్ తేజపై అతి కిరాతకంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటున్నారు బాధితుడి బంధువులు.

Related News

Bank Robbery: ఎస్బీఐ నుంచి 5 లక్షలు చోరీ.. షాకైన అధికారులు, దొంగ ఎవరో తెలుసా?

School Bus Accident: బోల్తా పడ్డ ప్రైవేట్ స్కూల్ బస్సు.. స్పాట్ లోనే 20 మంది విద్యార్ధులు

Tamilnadu News: నిన్న బెంగుళూరు.. నేడు తమిళనాడు.. రేపు..?

Bus Accident: ట్యాంకర్ ను ఢీకొట్టి వంతెన పై నుంచి ఎగిరి పడ్డ బస్సు, ఐదుగురు స్పాడ్ డెడ్!

Adilabad Collectorate: ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Encounter: భారీ ఎన్‌కౌంటర్.. పది మంది మావోయిస్టులు మృతి

Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!

Big Stories

×