Mirai:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. తనకంటూ అప్పట్లోనే ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు తేజ సజ్జా (Teja Sajja). ఆ తర్వాత సమంత(Samantha )- నందిని రెడ్డి(Nandini Reddy) కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా అవతరించారు. ఆ తర్వాత అదే డైరెక్టర్ దర్శకత్వంలో ‘హనుమాన్’ అంటూ సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)దర్శకుడిగా తొలి పరిచయంలో చేసిన చిత్రం ‘మిరాయ్’. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో తేజ సూపర్ యోధా పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12 అనగా నేడు విడుదలైన ఈ సినిమాపై బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాకుండా దాదాపు అన్ని ఏరియాలలో కూడా హౌస్ ఫుల్ థియేటర్లతో రన్ అవుతూ.. మరో సూపర్ హిట్ ను తేజ ఖాతాలో చేరవేసింది ఈ చిత్రం. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి.. కృతి ప్రసాద్ సహానిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ బ్యూటీ రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్గా నటించగా.. సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) , ప్రముఖ హీరో జగపతిబాబు(Jagapathi Babu)కీలక పాత్రలు పోషించారు. అలాగే మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటించగా.. దగ్గుబాటి రానా (Rana Daggubati) మెయిన్ విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
మిరాయ్ మూవీపై వర్మ ప్రశంసలు..
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాపై దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇచ్చిన రివ్యూ వైరల్గా మారింది. తాజాగా కొన్ని కొన్ని చిత్రాలకు మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పే వర్మ.. అలాంటిది తేజా సజ్జను ఆకాశానికి ఎత్తేస్తూ.. మిరాయ్ సినిమాపై ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా.. “తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత విశ్వప్రసాద్ లకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బాహుబలి సినిమా తర్వాత మరే ఇతర చిత్రానికి కూడా నేను ఇంత ఏకగ్రీవ ప్రశంసలు వినలేదు. వీఎఫ్ఎక్స్, కథన గ్రిప్ రెండు కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఇంతకంటే ఈ చిత్రానికి రివ్యూ మరొకటి ఇవ్వలేను” అంటూ తన మాటలతో ముగించారు.
A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025
రూ.1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ..
ఇక వర్మ ఇచ్చిన రివ్యూ చూస్తుంటే రూ.1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా తేజా సజ్జ మరో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే ఇందులో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు పూర్తిస్థాయిలో ప్రాణం పోశారు అనడంలో సందేహం లేదు.
ALSO READ:Samyuktha Menon: అమ్మడి రేంజ్ మామూలుగా లేదుగా.. లైనప్ చూస్తే షాక్!