Man Killed Father: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తండ్రిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. స్కిజోఫ్రెనియా(మతి భ్రమ)తో బాధపడుతున్న 28 ఏళ్ల భారత సంతతి వ్యక్తి అభిజిత్ పటేల్.. అమెరికాలోని తన ఇంట్లో తండ్రిని సుత్తితో చంపాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తల్లికి మాత్రం తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. పోలీసుల అరెస్టు తర్వాత, తనను తండ్రి చిన్నప్పుడు లైంగికంగా వేధించాడని, అందుకే తండ్రిని హత్య చేశానని చెప్పాడు. అయితే ఇదంతా అతడి కల్పితమేనని వైద్యులు అంటున్నారు.
అమెరికాలోని షాంబర్గ్‌లో 67 ఏళ్ల తండ్రిని స్లెడ్జ్‌హామర్‌తో కొట్టి చంపాడు 28 ఏళ్ల అభిజిత్ పటేల్. ఈ ఘటనపై పోలీసులు ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. బాధితుడు అనుపమ్ పటేల్ నవంబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు తన బెడ్‌రూమ్‌లో తల నుండి రక్తస్రావం అవుతూ స్పందించకుండా పడిఉన్నట్లు అతడి భార్య గుర్తించింది. హత్య జరిగిన రోజు, అనుపమ్ పటేల్ భార్య ఉదయం 5:42 గంటలకు వర్క్ కు వెళ్లింది. ఆమె భర్త, కొడుకు ఇంట్లో ఉన్నారు.
బాధితుడు డయాబెటిస్ కారణంగా ఉద్యోగం చేయడం లేదు. అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు లింక్ అయి ఉన్నాయని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. అనుపమ్ పటేల్ ఉదయం 8 గంటలకు తన భార్యకు ఫోన్ చేసి తన డయాబెటిక్ స్థితిని గురించి తెలియజేసేవాడు. ఆ సంఘటన జరిగిన తేదీన అతను అలా చేయలేదు. తన భర్త గ్లూకోజ్ స్థాయిలు పడిపోతున్నాయని ఫోన్ ద్వారా తెలుసుకున్న ఆమె ఆందోళన చెంది ఫోన్ ద్వారా భర్త, కొడుకును సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
తన భర్త గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం చూసి, ఆందోళన చెంది ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. అయితే గ్యారేజ్ తలుపు తెరిచి ఉండటం, తన కొడుకు నాన్నను జాగ్రత్తగా చూసుకున్నానని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తన భర్త రక్తంతో మంచం మీద పడి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు వెంటనే అక్కడికి చేరుకుని అనుపమ్ పటేల్ పరీక్షించగా.. అతడు అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలంలో పెద్ద సుత్తిని రికవరీ చేశారు. పోస్టుమార్టంలో అనుపమ్ పటేల్ తలపై సుత్తితో బలంగా రెండు దెబ్బలు తగిలాయని వైద్యులు తెలిపారు.
నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసుల ఎదుటలొంగిపోయాడు. విచారణ సందర్భంగా, తండ్రి తనను చిన్నప్పుడు లైంగికంగా వేధించాడని, అందుకే తండ్రిని చంపడం తనకు మతపరమైన బాధ్యతని పోలీసులకు చెప్పాడు. అభిజిత్ పటేల్‌కు స్కిజోఫ్రెనియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు రికార్డులు గుర్తించారు. ఈ కేసులో విచారణ డిసెంబర్ 19న జరగనుంది.
Also Read: Thoothukudi Gang Rape: తమిళనాడులో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం..