Aarogyasri Services: తెలంగాణలో మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడింది. రేపు రాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత కొద్ది కాలం నుంచి ప్రభుత్వం చెల్లించండం లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని ప్రవైట్ హాస్పిటల్స్ వాపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి