E-Paper
Advertisement

Car Fire Accident: ORR పై ఘోర ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవదహనం

Car Fire Accident: ORR పై ఘోర ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవదహనం
Advertisement

Car Fire Accident: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు ఇల్లు దాటి రోడ్డు మీదకు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. నిత్యం ఏదొక ప్రదేశంలో రోడ్డు ప్రమాద ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. తాజాగా హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. లియోనియో రెస్టారెంట్ వద్ద వెళ్తున్న ఎకోస్పోర్ట్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎగిసిపడటంతో డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనం అయ్యాడు. శామీర్ పేట నుండి కీసరకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఓఆర్ఆర్ నిత్యం వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైవర్ సీటులోని వ్యక్తి అస్తిపంజరంగా మారిపోయాడు. ఈ ఘటన చెందిన ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: డ్రైవర్ నిద్ర మత్తు.. దారి తప్పిన బస్సు..!

కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మంటల్లో కాలిపోవడంతో.. డ్రైవర్‌ను గుర్తించడానికి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఓఆర్ఆర్ టోల్ ప్లాజా ఫుటేజ్, లియోనియో రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు సేకరిస్తున్నారు. వాహనం యజమాని వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×