E-Paper
Advertisement

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్,  కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

1. పట్టించుకోలేదు

గత ప్రభుత్వం పదేళ్లు మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో ఆయన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు మంత్రి. మార్చి లోపు 2కోట్ల మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి.

2. కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు

కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి సురేష్ గొర్రెలను పట్టాలు దాటిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సురేష్ వాగులో పడి గల్లంతు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3. తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రుల వాట్సాప్‌ మీడియా గ్రూపులు హ్యాక్‌ అయ్యాయి. SBI ఆధార్‌ అప్‌డేషన్‌ చేసుకోవాలంటూ మెసేజ్‌ లు పంపించారు. పలువురు మంత్రుల వాట్సాప్‌ గ్రూప్‌లు హ్యాక్‌ చేసి..
APK ఫైల్స్‌ షేర్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ ఫైల్స్‌ ఓపెన్‌ చేయొద్దని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

4. ప్రాంతంలో సందడి వాతావరణం

అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

5. హాస్పిటల్ ధ్వంసం

అనంతపురంలోని సాయి నగర్‌లో నూతనంగా నిర్మించిన హాస్పిటల్‌లో వైసీపీ నేతల అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఏసీలు, ఐసీయూ అద్దాలు, లిఫ్ట్‌ను పూర్తిగా పగలగొట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు సత్యనారాయణ రెడ్డి దాదాపు 30 మందితో వచ్చి హాస్పిటల్‌ను ధ్వంసం చేశారన్నారు బాధితురాలు.

6. వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం

వికారాబాద్ జిల్లా అగ్గనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సమీర్ ఖాన్, అరుణ్ గౌడ్ మధ్య నాగులకుంట వద్ద గొడవ జరిగింది. అరుణ్ గౌడ్, సమీర్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో మనస్థాపంతో సమీర్ ఖాన్ ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గంజి బిపాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7. జగన్‌పై మంత్రి రవీంద్ర ఫైర్

వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్‌లో దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో మైనింగ్‌పై ఆధారపడిన వారికి రోజూ దినదిన గండంగా గడిచిందన్నారు. అయితే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామన్నారు రవీంద్ర.

8. రహస్య సమావేశంలో ముఖ్యనేతలు

నెల్లూరు మేయర్‌ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది టీడీపీ. మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, డిప్యూటీ మేయర్లు, టీడీపీ ముఖ్య నేతలు
రహస్యంగా సమావేశమయ్యారు. స్రవంతి మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఇప్పటికే కార్పొరేటర్ల వద్ద సంతకాలు సేకరించారు. రేపు కలెక్టర్ ని కలవనున్నట్లు సమాచారం అందుతోంది.

9. కాలువలో పడి కారు గల్లంతు

బాపట్ల జిల్లాలో కాలువలో పడి ఓ కారు గల్లంతు అయ్యింది. సంతమగులూరు మండలం మక్కెనవారి క్రాస్ రోడ్డు వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. ఆ కారు వినుకొండ నుంచి ఒంగోలు వెళుతుండగా.. బైక్ అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులోని వ్యక్తిని అటుగా వెళుతున్న అయ్యప్ప స్వాములు కాపాడారు. అయితే, కారు మాత్రం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.

10. పేలిన సిలిండర్.. స్పాట్‌లో

హైదరాబాద్ మధురానగర్‌‌లోని కార్మికనగర్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

11. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ

శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ముగిసినా రద్దీ తగ్గకపోవడంతో, ఉచిత దర్శనానికి మూడు గంటలు, టికెట్ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అల్పాహారం, మంచి నీరు వంటి ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు.

12. పటేల్‌ను మరచిపోరు.. కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌‌లోని సీతాఫల్ మండిలో నిర్వహించిన ‘సర్దార్ 150 యూనిటీ మార్చ్’లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనపై సర్దార్ వల్లభాయ్ పటేల్ యుద్ధం ప్రకటించి, తెలంగాణను భారత్‌లో విలీనం చేసి విముక్తి కల్పించారని ఆయన కొనియాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు పటేల్‌ను మరచిపోరని అన్నారు కిషన్ రెడ్డి.

13. చీరల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా నియోజకవర్గంలో మొదటి విడతగా 46 వేల మంది డ్వాక్రా మహిళలకు చీరలు అందిస్తామని, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

14. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. మొత్తం 424 మందిని పట్టుకొని కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్ర నేరమని, ప్రమాదానికి కారణమైతే10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని పోలీసులు హెచ్చరించారు.

15. ప్రజా సేవకుడు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన నూతన క్యాంప్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. తాను అధికారం ప్రదర్శించడానికి కాకుండా, ప్రజా సేవకుడిగా ఉంటానని, ఎమ్మెల్యేల సహకారంతో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు.

16. అలర్ట్

మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంపచోడవరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరమయ్యాయి. జగదల్‌పూర్‌ వెళ్లే హైవేను బంద్‌ చేసి రాకపోకలు నిలిపివేశారు. రాత్రివేళ ఆర్టీసీ సర్వీసులు బంద్ చేశారు.

17. ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక వ్వాఖ్యలు

దక్షిణాఫ్రికా జోహనస్‌బర్గ్ వేదికగా జరుగుతోన్న జీ-20 సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కూటమి ఉనికి ప్రమాదంలో ఉండటాన్ని మేక్రాన్ ప్రస్తావించారు. ప్రధాన సంక్షోభాలను పరిష్కరించేందుకు కలిసికట్టుగా పోరాడటంలో కూటమి ఇబ్బంది పడుతోందన్నారు.

18. డీఎంకేపై విజయ్ ఫైర్

టీవీకే చీఫ్, సినీ నటుడు విజయ్, కాంచీపురం జిల్లాలో తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. తమిళనాడు అధికారిక డీఎంకే పార్టీ దోపిడీ భావజాలానికి, వారసత్వ రాజకీయాలకు నిలయమని, ప్రజలను విడదీసేలా రాజకీయం చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సదస్సుకు కేవలం 1500 మందిని మాత్రమే అనుమతించారు.

19. మైలురాయి

గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో అమరన్ చిత్రం ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.

20. ముత్తుసామి సెంచరీ

గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ముత్తుసామి తన తొలి టెస్ట్ సెంచరీ సాధించగా, మార్కో యాన్సెన్ 93 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×