E-Paper
Advertisement

Karimnagar Crime: కరీంనగర్ టూ జైలు: భార్యతో వలపు చిందులు.. భర్తతో వీడియో షూటింగ్‌లు.. చివరకు కటకటాల్లోకి!

Karimnagar Crime: కరీంనగర్ టూ జైలు: భార్యతో వలపు చిందులు.. భర్తతో వీడియో షూటింగ్‌లు.. చివరకు కటకటాల్లోకి!
Advertisement

Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో వలపు వల వేసి అమాయకులను దోచుకుంటున్న కిలాడీ దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు రట్టు చేశారు. జిల్లాలోని ఆరేపల్లి సమీపంలో గల శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారీ వసూళ్లకు పాల్పడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ, శారీరక సుఖం కావాలంటే సంప్రదించాలంటూ నంబర్లు ఇచ్చి బడా వ్యాపారవేత్తలను, యువకులను ఆకర్షించేవారు. వారు తమ అపార్ట్‌మెంట్‌కు రాగానే, సదరు మహిళతో శారీరకంగా కలిసే సమయంలో భర్త చాటుగా నగ్న వీడియోలు, ఫోటోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు దండుకునేవారు.

Advertisement

ఈ దారుణమైన వసూళ్లతో వారు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడమే కాకుండా, విలాసవంతమైన కారు ఈఎంఐలు కూడా కడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి మాయలో పడి ఇప్పటివరకు దాదాపు వందమందికి పైగా మోసపోయినట్లు సమాచారం.

ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దంపతుల వలలో చిక్కి ఏకంగా 14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బాధితుడి వద్ద డబ్బులు అయిపోవడంతో అతను రావడం మానేయగా, నిందితులు మళ్ళీ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. పాత వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని, చంపేస్తామని బెదిరించడంతో భయపడిపోయిన బాధితుడు మరో లక్ష రూపాయలు ఇచ్చాడు. అయినప్పటికీ నిందితులు ఇంకా 4 లక్షలు కావాలని ఒత్తిడి చేయడంతో, చేసేదేమీ లేక బాధితుడు తన స్నేహితుల సలహాతో పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఆ కిలాడీ దంపతులను జైలుకు తరలించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రలోభాలకు గురికావొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Read Also: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×