E-Paper
Advertisement

400 Crore Container: రూ.400 కోట్ల కంటైనర్ మిస్సింగ్.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్

400 Crore Container: రూ.400 కోట్ల కంటైనర్ మిస్సింగ్.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్
Advertisement

400 Crore Container: రూ.400 కోట్లు తరలిస్తున్న కంటైనర్లు కర్ణాటకలో మిస్సింగ్ సంచలనం రేపుతోంది. బెళగావి జిల్లా సరిహద్దులో జరిగిన అతిపెద్ద దోపిడీ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారింది. రూ.400 కోట్లు తరలిస్తున్న 2 కంటైనర్లు హైజాక్ అయ్యాయి. 2025 అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నాసిక్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తాం- కర్ణాటక మంత్రి

ఈ వ్యవహారంపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధమన్నారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటకగా మీదుగా తిరుపతికి వెళ్లాల్సిన ఆ వాహనాన్ని దుండగులు దారి మళ్లించారనే విషయంపై మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. కర్ణాటక బెలగావిలో ఈ దోపిడీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్‌లో కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

Advertisement

కొన్ని రాష్ట్రాల్లో జరిగి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బు తరలిస్తుందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కర్ణాటక కాంగ్రెస్ అంటున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో ఏ ప్రభుత్వం ఉందో గుర్తించాలని కర్ణాటక మంత్రులు సవాల్ విసిరారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బు

నాసిక్ కు చెందిన సందీప్ పాటిల్ కిడ్నాప్ అనంతరం భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. కంటైనర్లు మిస్ అయిన తర్వాత మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టి తన అనుచరులతో కలిసి సందీప్ పాటిల్ ను కిడ్నాప్ చేశారు. కంటైనర్ హైజాక్ కు అతడే కారణమని కిషోర్ శెట్టి హింసించాడని తెలుస్తోంది. రూ.400 కోట్లు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించాడని, కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న సందీప్.. నాసిక్ పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

Also Read: కీసర జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. గొడ్డలితో దాడి చేసిన ఆ ఇద్దరు అరెస్ట్

రంగంలోకి సిట్

రూ.400 కోట్ల కంటైనర్ హైజాక్ చేసినట్లు సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్ ఫిర్యాదుతో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీరిద్దరి అరెస్టు తర్వాతే కంటైనర్ హైజాక్ కేసు ఓ కొలిక్కి రానుంది. ఈ దోపిడీ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సిట్‌కు అప్పగించింది. ఈ కేసులో సహకరించాలని బెళగావి ఎస్పీ రామరాజన్‌కు లేఖ మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రూ.400 కోట్ల కంటైనర్ మిస్సింగ్ మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×