E-Paper
Advertisement

Oats Laddu Recipe: రుచికరమైన ఓట్స్ లడ్డూ.. సింపుల్‌గా ఇలా రెడీ చేస్కోండి

Oats Laddu Recipe: రుచికరమైన ఓట్స్ లడ్డూ.. సింపుల్‌గా ఇలా రెడీ చేస్కోండి
Advertisement

Oats Laddus Recipe: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ దొరకడం కష్టమైపోతోంది. ముఖ్యంగా తీపి తినాలనిపించినప్పుడు మార్కెట్‌లో దొరికే స్వీట్ల కంటే, ఇంట్లోనే చేసుకునే ‘ఓట్స్ లడ్డూలు’ మంచివి. ఓట్స్ అంటే కేవలం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు.. వీటితో చేసే లడ్డూలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో పంచదారకు బదులుగా బెల్లం లేదా ఖర్జూరాలు వాడటం వల్ల.. ఇవి పోషకాల గనిగా మారుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లడ్డూలు తయారీలోనూ చాలా సులభం. ఆరోగ్యకరమైన ఓట్స్ లడ్డూల తయారీ విధానం, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లడ్డూలు చేయడానికి మనకు తక్కువ సమయం, తక్కువ పదార్థాలు సరిపోతాయి. వీటిని ఒక్కసారి చేసుకుంటే.. వారం పది రోజుల పాటు నిల్వ ఉంటాయి.

Advertisement

కావాల్సిన పదార్థాలు:

ఓట్స్: 2 కప్పులు (రోల్డ్ ఓట్స్ లేదా ఇన్‌స్టంట్ ఓట్స్)

Advertisement

బెల్లం తురుము: 1 కప్పు

నెయ్యి: 2 నుంచి 3టేబుల్ స్పూన్లు

పల్లీలు: తగినంత

నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి: 1 టీస్పూన్

డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు ముక్కలు

తయారీ  విధానం:

1. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో ఓట్స్ వేసి, తక్కువ మంట మీద 5-7 నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఓట్స్ మంచి సువాసన వచ్చే వరకు వేయించి, ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

2. చల్లారిన ఓట్స్ , వేయించిన వేరుశనగ పప్పులను మిక్సీ జార్ లో వేసి కొంచెం బరకగా (రవ్వలా) గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.

3. బెల్లం తురుమును కొద్దిగా నీళ్లు పోసి కరిగించి వడకట్టాలి (నలకలు లేకుండా). ఈ బెల్లం నీటిని కొంచెం జిగురు వచ్చే వరకు మరిగించాలి. (మీకు పాకం వద్దనుకుంటే.. మిక్సీ పట్టిన ఓట్స్ పొడిలో నేరుగా మెత్తని బెల్లం కలిపి కూడా లడ్డూ చుట్టుకోవచ్చు). ఒక వెడల్పాటి గిన్నెలో ఓట్స్ పొడి, వేయించిన నువ్వులు, యాలకుల పొడి , నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి బాగా కలపాలి.

4. ఇప్పుడు తయారు చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసి, వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. చేతులకు కొంచెం నెయ్యి రాసుకుంటే లడ్డూలు బాగా వస్తాయి.

Also Read: పిల్లల నుంచి పెద్దల వరకు, అందరికీ నచ్చే ప్రొటీన్ కేక్.. క్షణాల్లోనే రెడీ చేయండిలా !

ఓట్స్ లడ్డూల వల్ల కలిగే ప్రయోజనాలు:

పీచు పదార్థం: ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా.. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బరువు తగ్గుదల: ఈ లడ్డూలు తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ స్నాక్.

గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే మంచి కొవ్వులు , బెల్లంలోని ఐరన్ గుండె ఆరోగ్యానికి, రక్తహీనత నివారణకు తోడ్పడతాయి.

తక్షణ శక్తి: జిమ్‌కు వెళ్లేవారు లేదా ఆఫీసులో అలసిపోయిన వారు ఒక లడ్డూ తింటే వెంటనే ఎనర్జీ లభిస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు: పంచదార వాడకుండా, తక్కువ బెల్లం లేదా ఖర్జూరంతో చేస్తే.. డయాబెటిస్ ఉన్నవారు కూడా డాక్టర్ సలహాతో ఓట్ప్ లడ్డూ తీసుకోవచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×