E-Paper
Advertisement

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!
Advertisement

Karnataka: ఆన్‌లైన్ గేమింగ్ పిచ్చి ఎంతటి దారుణానికి దారితీస్తుందో చెప్పడానికి కర్ణాటకలో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ. గేమ్‌లు ఆడొద్దని వారించినందుకు ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు కన్నవారిపైనే కత్తితో తెగబడ్డాడు. కొప్పళ జిల్లా గంగావతి నగరంలో ఈ ఘోరం జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. వెంకట నాయుడు (48), సౌజన్య దంపతులకు కుమార్తె ప్రగతి (20), ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రోజూ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు, అక్క.. గేమ్‌లు ఆడొద్దని, చదువుకోవాలని మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలుడు అర్ధరాత్రి కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

Advertisement

ఈ దాడిలో తండ్రి వెంకట నాయుడు, అక్క ప్రగతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన తల్లి సౌజన్యతో పాటు నిందితుడైన బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×