E-Paper
Advertisement

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు
Advertisement

Inzamam-ul-haq ON IND ZIM : జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా (( Zimbabwe vs. Team India )
) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Zimbabwe 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల‌ మధ్య రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండింటిలో కూడా టీమిండియానే విజయకేతనం ఎగరవేసింది. నిన్న హరారే వేదికగా రెండో టీ20 జరగగా అందులో 90 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకొని.. టైటిల్ గెలుచుకుంది శ్రేయస్ అయ్యర్ సేన. దీంతో అయ్యర్ కెప్టెన్సీలో తొలి టీ20 సిరీస్ టీమిండియా గెలుచుకుంది. టీమిండియా సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తన్వీర్ అహ్మద్ ( Tanveer ahmed) స్పందించగా… లేటెస్ట్ గా ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam ul haq ) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆటగాళ్లకు కావాలనే జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారని హాట్ కామెంట్స్ చేశారు. అందుకే టీమిండియా అవలీలగా సిరీస్ గెలవగలిగిందన్నారు ఇంజమామ్ ఉల్ హ‌క్.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Advertisement

జింబాబ్వే పైన టీమిండియా టి20 సిరీస్ గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ హాట్ కామెంట్స్ చేశారు. విదేశీ గడ్డలపై టీమిండియా సిరీస్ గెలవడం అసాధ్యమన్నారు. కానీ జింబాబ్వే పై అవలీలగా టీమిండియా సిరీస్ గెలవడం వెనుక కుట్రకోణం ఉందని బాంబు పేల్చారు. జింబాబ్వే క్రికెట్ బోర్డుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కుమ్మక్కు అయిందని… అందుకే సిరీస్ ఈజీగా గెలిచారని తెలిపారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోయి మ్యాచ్ గెలిచారని తెలిపారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఇంజమామ్ ఉల్ హ‌క్.

జింబాబ్వే ప్లేయర్లు అమ్ముడుపోయారు – తన్వీర్ అహ్మద్

జింబాబ్వే పైన టీమిండియా టి20 సిరీస్ గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer ahmed) కూడా రెచ్చిపోయి కామెంట్ చేశాడు. బిసిసిఐ ఇచ్చిన డబ్బులకు జింబాబ్వే క్రికెట్ బోర్డ్ అమ్ముడుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కావాలనే ఇండియా చేతిలో జింబాబ్వే ఓడిపోయిందని తెలిపారు. విదేశీ గడ్డలపై టీమిండియా గెలవడం అసాధ్యమన్నారు. కానీ టీమిండియా ప్లేయర్లకు అనుగుణంగా హైవే లాంటి మైదానాలను జింబాబ్వే సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవలీలగా సిరీస్ గెలిచి బయటపడిందని టీమిండియా పై ఆరోపణలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.

Advertisement

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

Related News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

తెలుగోడు నితీశ్ కొంప ముంచిన ప్రీతి జింటా? కావ్య మ‌రో బ్లాస్టిక్ నిర్ణ‌యం!

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

Big Stories

Advertisement
×