E-Paper
Advertisement

Woman Elopes With Lover: పెళ్లయిన మూడు నెలలకే.. షాకైన భర్త, ఇక ఏమీ చేయలేక, కర్ణాటకలో దారుణం

Woman Elopes With Lover: పెళ్లయిన మూడు నెలలకే.. షాకైన భర్త, ఇక ఏమీ చేయలేక, కర్ణాటకలో దారుణం
Advertisement

Woman Elopes With Lover: ఓ యువతికి వివాహం జరిగింది. అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ మధ్యవర్తి ఆ యువతిని కన్వీన్స్ చేశాడు. ఏమీ చేయలేకపోయింది తల వంచుకుని తాళి కట్టించుకుంది. చివరకు పెళ్లయిన మూడు నెలలకు కోరుకున్న ప్రియుడితో వెళ్లిపోయింది. సంచలన రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇంతకీ ఆ మహిళ భర్త ఏం చేశాడో తెలుసా?

కర్ణాటకలో దారుణమైన ఘటన.. పెళ్లయిన మూడు నెలలకే

Advertisement

కర్ణాటకలో మూడు నెలల కిందట జరిగిన ఓ వివాహం రెండు ఆత్మహత్యలకు దారి తీసింది. ఈ ఎపిసోడ్ రెండు కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తింది. మరొక కుటుంబం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. కర్ణాటకలోని దావణగెరె ప్రాంతం విషాద ఘటనకు వేదికైంది. ఆ ప్రాంతానికి చెందిన సరస్వతి అనే యువతికి హరీశ్‌తో మూడు నెలల కింద వివాహం జరిగింది.

పోలీసుల ప్రాథమిక విచారణ మేరకు.. వివాహానికి ముందే సరస్వతికి ప్రేమ స్టోరీ ఉంది. ఈ విషయం బయటకు తెలియకుండా సరస్వతి మేనమామ రుద్రేశ్.. హరీష్ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి జరిపించాడు. చివరకు తాళి కట్టిన భర్త కంటే.. ప్రేమించిన ప్రియుడు దైవంగా భావించింది. ఈ క్రమంలో జనవరి 23న గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది సరస్వతి.

Advertisement

భర్తని విడిచి.. ప్రియుడితో పారిపోయిన మహిళ

ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. కంగారు పడిన సరస్వతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసి షాకయ్యారు. సరస్వతి కోరుకున్న ప్రియుడు శివకుమార్‌తో వెళ్లిపోయినట్లు తేలింది. ఈ విషయాన్ని హరీష్ కుటుంబసభ్యులకు తెలిపారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు భర్త హరీశ్.

తన పరువుపోయిందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య వెనుక కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. హరీశ్ మరణ వార్త తెలుసుకున్నాడు మధ్యవర్తి రుద్రేశ్. తనకు కష్టాలు తప్పవని భావించాడు. చివరకు అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దావణగెరె గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు, కంటైనర్ ఢీ

ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న కేసు ఒకటి. సరస్వతి కూడా అత్తింటి నుంచి వేధింపుల కారణంగా తాను పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులు అందాయని, దర్యాప్తు ప్రారంభించినట్టు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. భర్త ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై సరస్వతిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×