E-Paper
Advertisement

Road Accident: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Road Accident: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Advertisement

Road Accident: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన కారు బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారులో ఉన్న వ్యక్తులు పరారీ అయినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మల్యాల గ్రామం వైపు వెళుతున్నారు.  తెల్లవారుజామున కీసర ఔటర్ రింగ్ రోడ్ సమీపానికి చేరుకున్న సమయంలో.. వేగంగా వచ్చిన ఓ కారు వారి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

Advertisement

ఈ నేపథ్యంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: డబుల్ మర్డర్ వ్యవహారం.. చంపేసి శరీరాలను ముక్కులుగా చేసి, ఆ తర్వాత.. యూపీలో ఘోరం

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు వేగంగా వెళ్లిందా, మద్యం సేవించి డ్రైవ్ చేశారా, లేక నిర్లక్ష్యంగా వాహనం నడిపారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×