Smartphone Buying Guide: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో రోజూ విడుదలవుతున్న కొన్ని మోడల్స్ చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదా? ఇక్కడే కాస్త జాగ్రత్తగా ఆలోచించి కొంటే మనం కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయికి పూర్తి విలువ దక్కుతుంది. లేదంటే.. కొన్న కొన్ని రోజులకే ఫోన్ హ్యాంగ్ అవ్వడం, బ్యాటరీ డ్రైన్ అయిపోవడం చూసి బాధపడాల్సి వస్తుంది. అందుకే.. కొత్త మొబైల్ తీసుకునే ఆలోచనలో ఉంటే.. హడావుడిగా ఏదో ఒక ఫోన్ కొనేయకుండా ఈ ఐదు విషయాలను చెక్ చేసుకోండి. అప్పుడే మీ బడ్జెట్‌కు తగ్గ పర్ఫెక్ట్ ఫోన్ చేతికి అందుతుంది.
మీరు ఫోన్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టగలమనేది ముందే ఫిక్స్ కావాలి. మార్కెట్‌లో రూ.10,000 నుంచి రూ.లక్ వరకు ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మన అవసరానికి తగినట్లు బడ్జెట్ నిర్ణయించుకోవడం చాలా అవసరం. కేవలం బ్రాండ్ చూసి ఎక్కువ డబ్బులు వృధా చేయకుండా, మన అవసరానికి సరిపోయే మోడల్ ఎంచుకోవాలి.
Also Read: వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!
నేటి ఆధునిక యుగంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ వాడేస్తున్నాం. అందుకే బ్యాటరీ సామర్థ్యం కనీసం 5000mah ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫోన్ త్వరగా ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుంది. రోజంతా ఛార్జింగ్ గురించి టెన్షన్ పడకుండా ఇది కాపాడుతుంది.
మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఫొటోలు బాగుంటాయని చెప్పలేం. లెన్స్ నాణ్యత, వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా చీకట్లో లేదా రాత్రి సమయంలో ఫొటోలు తీసేటప్పుడు క్లారిటీ ఎలా వస్తుందో చెక్ చేసుకోవడం ముఖ్యం. సెల్ఫీ కెమెరా కూడా మన అవసరానికి తగినట్లు ఉండాలి.
ఫోన్ ఎంత వేగంగా పనిచేస్తుందనేది దాని ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. మనం సోషల్ మీడియా వాడినా, గేమ్స్ ఆడినా ఫోన్ హ్యాంగ్ అవ్వకూడదు. అందుకోసం ర్యామ్, ప్రాసెసర్ ఏ కంపెనీవో పరిశీలించాలి. సాధారణ వాడకానికి కనీసం 6 లేదా 8GB ర్యామ్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.
ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి కనీసం 128Gb స్టోరేజ్ అవసరం. దీనివల్ల ఫోన్ మెమరీ త్వరగా నిండిపోదు. అలాగే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఎంతకాలం అప్‌డేట్స్ ఇస్తారో చూసి కొనడం వల్ల ఆ ఫోన్ ఎక్కువ కాలం మన్నడానికి అవకాశం ఉంటుంది.
Also Read: ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!