when to use HDR on smartphone: ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది..సందర్భాన్ని బట్టి కొంతమంది ఫోటోగ్రాఫర్లుగా మారిపోతుంటారు! ఎక్కడైనా అందమైన ప్రదేశం కనిపిస్తే చాలు, వెంటనే కెమెరా ఓపెన్ చేసి క్లిక్ మనిపిస్తారు. అయితే మనం తీసే ఫోటోలు కొన్నిసార్లు చాలా బ్రైట్‌గా, మరికొన్ని సార్లు చాలా నల్లగా వస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే మన ఫోన్ కెమెరాలలో ‘HDR’ అనే అద్భుతమైన ఫీచర్ వస్తుంది. చాలామంది ఈ ఆప్షన్‌ని ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల ఫోటోలు పాడవుతాయని మీకు తెలుసా ? అసలు HDR ఆన్ చేస్తే ఫోటోలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
HDR అంటే హై డైనమిక్ రేంజ్. సాధారణంగా మన కళ్ళు చూసే అంశాన్ని కెమెరా ఒకే క్లిక్‌లో సరిగ్గా బంధించలేదు. ఒకే ఫ్రేమ్‌లో ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశం, చీకటిగా ఉన్న నీడలు రెండూ ఉన్నప్పుడు కెమెరా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ సమయంలో HDR ఫీచర్ ఆన్ చేస్తే.. కెమెరా క్షణాల్లో వేర్వేరు ఎక్స్‌పోజర్‌లతో మూడు ఫోటోలను తీసి, వాటన్నింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌డ్ ఫోటోను మనకు అందిస్తుంది.
బ్యాలెన్స్‌డ్ లైటింగ్: కాంతి ఎక్కువగా ఉన్న చోట, చీకటిగా ఉన్న చోట వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎండలో నిలబడి ఫోటో తీస్తే ముఖం నల్లగా రాకుండా, బ్యాక్‌గ్రౌండ్,ఫేస్ రెండు సరిగ్గా కనిపిస్తాయి.
కలర్స్ పాప్ అవుతాయి: ఫోటోలోని రంగులు మరింత సహజంగా,ఆకర్షణీయంగా మారుతాయి.
డీటెయిల్స్ పెరుగుతాయి: క్లౌడ్స్ (మేఘాలు), చెట్లు లేదా చిన్న చిన్న వివరాలు మిస్ కాకుండా ఫోటోలో క్యాప్చర్ అవుతాయి.
చాలా మంది చేసే పొరపాటు ఏంటి?
చాలామందికి HDR అంటే అన్ని సమయాల్లో వాడేయాలనిపిస్తుంది. ఎప్పుడూ HDR ని ‘ఆన్’మోడ్‌లో ఉంచడం చాలా పెద్ద మిస్టేక్.
కదులుతున్న సబ్జెక్ట్స్ (మనుషులు, పరిగెత్తే పిల్లలు, పక్షులు) ఫోటోలు తీసేటప్పుడు HDR వాడితే ఫోటో బ్లర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మూడు ఫోటోలను కలిపి ఒకటే తీస్తుంది కాబట్టి.. సబ్జెక్ట్ కదిలితే ఇమేజ్ చెడిపోతుంది.
అలాగే రాత్రి సమయంలో లేదా ఇంట్లో ఇండోర్ ఫోటోలు తీసేటప్పుడు HDR ఆన్ చేస్తే ఫోటోల్లో గ్లేర్ లేదా నాయిస్ విపరీతంగా పెరిగిపోతుంది.
Also Read: రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!
ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయాల్లో, సూర్యాస్తమయం లేదా సూర్యోదయం సమయంలో,నేచర్ కు సంబంధించిన ఫోటోలు తీసేటప్పుడు HDR కచ్చితంగా వాడాలి. అదే రాత్రి పూట, కదిలే వస్తువులపై, లేదా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఉన్నప్పుడు దీన్ని ఆఫ్ చేయడమే బెటర్. మోడర్న్ ఫోన్లలో ‘Auto HDR’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవడం ఇంకా బెటర్.
టెక్నాలజీ మనకు ఎన్నో ఫీచర్లను అందిస్తోంది. కానీ వాటిని ఏ సమయంలో ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. ఇకపై ఫోటోలు తీసేటప్పుడు HDR ఎక్కడ వాడాలో తప్పకుండా గుర్తుంచుకోండి, మీ ఫోటోగ్రఫీ లెవెల్ మారిపోతుంది!