Kurnool District Accident: కర్నూలు జిల్లా పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గంగావతి డిపోకు చెందిన బస్సు.. ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక గంగావతి నుండి ఆదోని మీదుగా రాయచూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. జాలిమంచి గ్రామం వద్ద ఓవర్ టేకే చేసే సమయంలో.. ముందు వెళ్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించారు.
మృతుల వివరాలు.. కుప్పగల్ గ్రామానికి చెందిన దంపతులు ఈరన్న , ఆదిలక్ష్మి మాన్వీకి చెందిన దేవరాజు, నాగరత్నమ్మ గా గుర్తించారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. హనుమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద గ్రానైట్ లారీ- ఇన్నోవా ఢీ కొట్టాయి. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయైంది. ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గ్రానైట్ లారీని తొలగించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మరోవైపు నెల్లూరు జిల్లా పెళ్లకూరులో హేమంత్ అనే వ్యక్తి తన భార్యపై అతి కిరాతంగా దాడి చేశాడు. స్క్రూడ్రైవర్, కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. స్థానిక యువకులు అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. కడప జిల్లా రైల్వేకోడూరుకి చెందిన లక్ష్మీప్రియ అనే యువతిని శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్లు తర్వాత ఆమెపై వరకట్న వేధింపులకు దిగాడు. ఇటీవల భార్యను కొట్టి ఇంటి నుంచి బయటకు గంటేశాడు. దీంతో.. ఆమె కుమారుడితో సహా పుట్టింటికి వెళ్లిపోయింది.
Also Read: సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి
అయితే.. భార్య, కుమారుడిని మంచిగా చూసుకుంటానని నమ్మించి అత్తారింటి నుంచి వారిని శ్రీకాళహస్తికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన వెంటనే మరోసారి ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు. గాయాలైన లక్ష్మీప్రియను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి.. గుంటాతోపు అనే ప్రాంతం దగ్గర హత్యచేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు అడ్డుకొని ఆమెని ఆసుపత్రికి తరలించారు. హేమంత్ కుమార్‌ని పోలీసులకి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.