Nani : నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం ‘హిట్ 3’ (Hit 3) తో పాటు ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో కూడా భాగం కాబోతున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి (Cibi Chakravarthi) దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించబోతున్నాడని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మరి ఈ మూవీ ఆగిపోవడానిక్ గల కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
శిబి చక్రవర్తితో నాని మూవీ ఆగినట్టేనా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం నాని – శిబి చక్రవర్తి కాంబినేషన్లో రావాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ రూమర్లు పుట్టుకు రావడానికి గల కారణం ఏంటంటే డైరెక్టర్ అంటున్నారు. కింగ్ నాగార్జునతో ‘డాన్’ మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత డైరెక్టర్ శిబి చక్రవర్తి తమిళనాడులోని ఎంతో మంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారని తెలుస్తోంది. అందులో శివ కార్తికేయన్ కూడా ఉన్నారట. అయితే అడ్వాన్స్ లను తిరిగి చెల్లించడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంకా కొంత మందికి డైరెక్టర్లకు చక్రవర్తి భారీగా డబ్బు చెల్లించాల్సి ఉండడం వల్ల ఆయన సమస్యల్లో పడ్డాడని సమాచారం.
ఈ కారణాల వల్లే నాని, శిబి చక్రవర్తి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమైన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు వెనక్కి తగ్గిందని అంటున్నారు. డైరెక్టర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయట పడే వరకు నాని కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. ఇప్పటికి శిబి చక్రవర్తి చెప్పిన స్టోరీ పై నానికి ఇంట్రెస్ట్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రూమర్లపై క్లారిటీ రావాలంటే డైరెక్ట్ శిబి చక్రవర్తి స్పందించే దాకా ఆగల్సిందే.
నాని ఖాతాలో మోస్ట్ అవెయిటింగ్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం నాని పలు మోస్ట్ అవైటింగ్ సినిమాలలో నటిస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్న ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ రెండు కూడా మోస్ట్ వైలెంట్ మూవీస్ గా తెరపైకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచాయి. విమర్శలు కూడా అదే రేంజ్ లో వినిపించాయి అనుకోండి. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి ఇటీవల విడుదలైన టీజర్ లో నాని సరికొత్త లుక్ లో కనిపించాడు. అందులో ఆయన ఏకంగా రెండు జడలు వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు నాని అలా సినిమాలో రెండు జడలు వేసుకుని కన్పించడం వెనుక వేరే కథ ఉందని డైరెక్టర్ వెల్లడించి, సినిమాపై ఆసక్తిని పెంచేశారు. అలాగే ‘హిట్ 3’లో నాని అర్జున్ సర్కార్ అని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.