Commandant Dies: సిరిసిల్ల లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ చనిపోయారు. తెలంగాణ సచివాలంయలో CSOగా పనిచేసిన గంగారాం… ప్రస్తుతం 17 వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి డిన్నర్ తర్వాత లిఫ్ట్ కోసం వెయిట్ కోసం థర్డ్‌ఫ్లోర్‌కు వెళ్లాడు. లిఫ్ట్ వచ్చిందని భావించి డోర్ ఓపెన్ చేశాడు. దాంతో మూడో ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి గంగారాంను బయటకు తీశారు.
ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. అప్పటికే గంగారాం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగారాంకి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. మృతుడి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తించారు పోలీసులు. గంగారాం మృతిపట్ల పోలీసులు సంతాపం తెలిపారు.
వాస్తవానికి లిఫ్ట్ రాకుండా డోర్లు ఓపెన్ కావు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. కాగా మరికొద్ది రోజుల్లో కమాండెంట్ గంగారాం రిటైమెంట్ అవ్వబోతున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: హైదరాబాద్‌లో ఘోరం.. పిల్లలను చంపి, ఆపై దంపతుల సూసైడ్
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రమాదావశాత్తు అపార్టుమెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అపార్ట్ మెంట్ లిఫ్టుకి, గోడకి మధ్య ఇరుక్కుపోయి రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించి ఆరేళ్లబాలుడు బయటకు తీసిన ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో లిఫ్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.