E-Paper
Advertisement

Road Accident: కారులో వేగంగా వెళ్తూ వీడియో.. చూస్తుండగానే నలుగురు దుర్మరణం

Road Accident: కారులో వేగంగా వెళ్తూ వీడియో.. చూస్తుండగానే నలుగురు దుర్మరణం
Advertisement

Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్ హరిద్వార్ హైవేపై అతివేగంగా దూసుకెళ్తున్న కారు, రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం అర్ధరాత్రి వేళ జరిగింది. రిషికేశ్ నుంచి హరిద్వార్ వైపు వెళ్తున్న కారు, ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆవును తప్పించబోయే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. అధిక వేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిపి ఉన్న భారీ ట్రక్కును ఢీకొట్టింది.

Advertisement

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైవేలపై ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ, జంతువుల కారణంగా ప్రమాదాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు రోడ్డుపక్కన ఎందుకు నిలిపి ఉందన్న అంశంపై కూడా విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హైవే భద్రతపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!

అతి వేగం థ్రిల్‌ను ఇవ్వొచ్చు కానీ, అది ప్రాణాలను హరించే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు పాటించడం, పరిమిత వేగంతో వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం నలుగురు యువకుల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, వారి కుటుంబాలను తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×