BigTV English
Advertisement

Miyapur crime news: 10th క్లాస్‌లో ల‌వ్.. ఇద్దరూ 5th ఫ్లోర్ నుండి దూకి.. అస‌లేం జ‌రిగిందంటే

Miyapur crime news: 10th క్లాస్‌లో ల‌వ్.. ఇద్దరూ 5th  ఫ్లోర్ నుండి దూకి.. అస‌లేం జ‌రిగిందంటే


Miyapur crime news: గత కొంత కాలంగా రాష్ట్రంలో విద్యార్థుల వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు గల కారణాలు వేర్వేరు అయినప్పటికీ.. ముందు ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే మళ్ళీ ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు పైనుంచి దూకి హన్సిక సూసైడ్‌ చేసుకుంది. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థిని ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థాలానిక చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


అయితే 10 రోజుల్లో ఒకే క్లాసుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మాధవనగర్‌లో ఒకే స్కూల్లో చదువుతున్న హన్సిక, రిజ్వన్ ఒకే క్లాసు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ స్నేహం కారణంగా ఇద్దరు ఇన్‌స్టాగ్రాం‌లో చాట్ చేసుకునేవారు. అయితే ఈ చాటింగ్ గురించి వారి టిచ‌ర్‌కు తెలియడంతో.. ఆ టిచర్ వెళ్ళీ ప్రిన్సిపాల్‌కి చెప్పింది. దీంతో ప్రిన్సిపల్ ఇద్దరిని ఆఫీసుకు పిలిపించి వారిని మందలించింది. రేపు స్కూల్‌కి వచ్చేటప్పుడు మీరు మీ పేరెంట్స్‌ను స్కూల్‌కి తీసుకురావాలని మందలించాడు.

ముందుగా రిజ్వాన్ వాళ్ల పేరెంట్స్‌ని తీసుకురావాలని చెప్పడంతో రిజ్వాన్ కాస్త భయపడ్డాడు. మా ఇద్దరి చాటింగ్ స్కూల్లో అందరికి తెలిసింది, ప్రిన్సిపల్‌కి కూడా తెలిసింది. ఇంకా మా పేరెంట్స్‌కి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడ్డాడు.. దీంతో మనస్థాపనికి గురైన రిజ్వాన్ స్కూల్ బిల్డింగ్‌‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.

అయితే రిజ్వాన్ చనిపోయిన తర్వాత వారి ఇంటికి హన్సిక, వాళ్ల తండ్రి ఇద్దరు కలిసి రిజ్వాన్ తల్లదండ్రులను పరామర్శించడానికి వెళ్లారు. శోక సంద్రంలో ఉన్న బాలుడి తల్లిదండ్రులు హన్సికాను దూషించారు. నీవల్లే నా కొడుకు మరణించాడు.. నువ్వు కూడా దూకి చనిపో అని రిజ్వాన్ తల్లి అనేక మాటలు అన్నది. దాంతో అక్కడి నుంచి హన్సిక వెళ్లపోయింది. అయితే ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో హన్సిక స్కూల్‌కి వెళ్లింది. కానీ, ఎగ్జామ్ రాయనీయకుండా హన్సికాను ఇంటికి పంపించేశారు స్కూల్ యాజమాన్యం.. తర్వాత ఇంటికి వచ్చిన హన్సిక స్కూల్లో తనను అన్న మాటలకు తీవ్ర మనస్థాపం చెందింది.. అలాగే తన స్నేహితుడు రిజ్వాన్ మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో తాను కూడా తన ఇంటి ఐదవ ప్లోర్‌కి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Also Read: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. చిక్కుకున్న చిన్నారులు..

స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టిచర్స్ దాన్ని సరిదిద్దాలి. కానీ టిచర్సే తప్ప చేస్తే ఇంకేవారికి చెప్పాలి. స్కూల్లో పిల్లల మైండ్‌సెంట్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. వారు ఏదైన తప్పు చేస్తే.. వారిని సెన్సిటివ్‌గా మందలించాలి. అంతే కాని గట్టిగా దండిస్తే వారు తీవ్ర మనస్థాపనికి గురవుతారు.

Related News

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Big Stories

×