Yash Dayal: రాయల్ చాలెంజెస్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) ఆటగాడు యశ్ దయాల్ (Yash Dayal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ దయాల్… అమ్మాయిల పట్ల దెయ్యంలా మారిపోయాడు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ యువతిని వాడుకున్న యశ్ దయాల్… ఇప్పుడు మరో యువతిని వేధించినట్లు తెరపైకి వచ్చింది. 17 ఏళ్ల అమ్మాయిని.. రెండు సంవత్సరాల పాటు వాడుకొని… తన కామ వాంఛ తీర్చుకున్నాడట ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు దయాల్. దీంతో ఈ క్రికెటర్ పై పోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
మరో యువతిపై బెంగళూరు బౌలర్ అత్యా**చారం
రాయల్ చాలెంజర్స్ స్టార్ ఆటగాడు యష్ దయాల్ మరోసారి కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన యువతి…. బెంగళూరు బౌలర్ దయాల్ పై అనేక రకాల ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వేధించాడని కూడా పేర్కొంటూ పోలీస్ కేసు కూడా పెట్టింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాటింగ్ లిస్టును కూడా బయట పెట్టింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళ. అయితే ఇదంతా వట్టిదే అని.. దయాల్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
అయితే ఇలాంటి నేపథ్యంలో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు స్టార్ ఆటగాడు దయాల్ పైన సరికొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు అతనిపై పోక్సో కేసు కూడా నమోదు అయింది. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఓ 17 సంవత్సరాల అమ్మాయిని… వాడుకొని వదిలేసాడట. తన కామ వాంఛతో ఆ యువతిపై రెచ్చిపోయాడట బెంగళూరు బౌలర్ దయాల్. దాదాపు రెండు సంవత్సరాలుగా పాటు ఈ 17 ఏళ్ల అమ్మాయిని వాడుకుని వదిలేసినట్లు తెలుస్తోంది.
జైపూర్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పరిచయం
యష్ దయాల్, 17 ఏళ్ల యువతి మధ్య పరిచయం జైపూర్ వేదికగా జరిగిందట. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దయాళ్ ను బాధితురాలు… జైపూర్ వేదికగా కలిసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొంది. క్రికెట్ కెరీర్ లో సలహాలు ఇస్తానంటూ సీతాపురాలోని ఓ హోటల్ కు తనను పిలిచినట్లు.. వెల్లడించింది బాధిత మహిళ. ఈ సందర్భంగా పలుసార్లు.. తనపై అఘాయిత్యం కూడా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా రెండు సంవత్సరాలుగా తనను వాడుకుంటున్నాడని 17 ఏళ్ల యువతి కేసు పెట్టింది. దీంతో తాజాగా బెంగళూరు బౌలర్ పై pocso చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ ఇది నిజంగానే నిరూపణ అయితే.. బెంగళూరు బౌలర్ యశ్ దయాల్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.